నందివెలుగు రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి అనుమతులివ్వండి.

0
251

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నందివెలుగు రోడ్డులో జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద కల్వర్టు నిర్మాణానికి వెంటనే పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని వెలగపూడి సచివాలయంలో కలిసి విన్నవించాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కల్వర్టు నిర్మాణం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే విషయాన్ని మంత్రి గారికి తెలియజేశాం. జాకీర్ హుస్సేన్ నగర్ లో రోడ్డు ప్రస్తుతం ఇరువైపులా వంద అడుగుల మేర ఉందని, కల్వర్టు మాత్రం కేవలం 30 అడుగులు మాత్రమే ఉందని, ఈ కారణంగా ట్రాఫిక్ తోపాటు భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని వివరించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నందివెలుగు బ్రిడ్జి నిర్మాణం వేగవంతంగా చేపట్టామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ రహదారిలో వాహనాల రాకపోకలు మరింత పెరిగి ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందనే విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పటికే కల్వర్టు నిర్మాణానికి ఇంజినీరింగ్ అధికారులు రూ.2.52 కోట్లతో అంచనాలు రూపొందించారని, ప్రతిష్టాత్మకమైన, ప్రజోపయోగకమైన కల్వర్టు నిర్మాణానికి వెంటనే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయాలని విన్నవించాను. నా వినతి మేరకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Search
Categories
Read More
Andhra Pradesh
‘జిల్లాలో శతశాతం అక్షరాస్యతే లక్ష్యం'
జిల్లాలో శతశాతం అక్షరాస్యత సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని DRDA పీడీ శ్రీనివాస పాణి...
By Boiena Rajesh 2026-08-19 13:08:32 0 93
BMA
PCI Announces Moulvi Muhammad Baqir Journalism Award
In a positive move to honor historic sacrifices in journalism, the Press Club of India (PCI) has...
By JoinBMA 2026-09-10 04:50:06 0 142
Goa
Goa Healthcare Initiatives 2026: Strengthening Care
Goa's healthcare initiatives in 2026 focus on improving access to quality medical services and...
By Fathima Safa 2026-06-16 07:06:17 0 163
Andhra Pradesh
దుర్గ గుడికి లక్ష విరాళం
*దుర్గగుడి అభివృద్ధికి లక్ష విరాళం*     విశాఖపట్నంలోని మాధురవాడకు చెందిన వంగపండు...
By Rajini Kumari 2025-12-31 10:19:50 0 248
Delhi - NCR
Revolutionizing Recovery: Advanced Neuro-Center Opens in Delhi
In a major boost to the city’s healthcare infrastructure, Lupin launched Atharv Ability in...
By Dunna Jessicaruth 2026-05-15 08:08:00 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com