23వ తారీకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవిగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు

0
247

ప్రకటన

 

విషయం: రేపు తేది 23.01.2026న శ్రీ పంచమి పురస్కరించుకుని శ్రీ కనక దుర్గ అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవి" అలంకారం లో దర్శనమిచ్చుట మరియు ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసములు గురించి.

@@@

 

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 23వ తేదీ, శుక్రవారం నాడు శ్రీ పంచమి (వసంత పంచమి) పర్వదినం అత్యంత వైభవంగా నిర్వహించ తలపెట్టడమైనది.

 

 చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినంగా భావించే ఈ పవిత్ర రోజున ఇంద్రకీలాద్రిపై విశేష పూజలు మరియు కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికె. శీనానాయక్ తెలిపారు.

 

అమ్మవారి అలంకారం:

 

శ్రీ పంచమి సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ వారు "శ్రీ సరస్వతీ దేవి" అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్వేత వస్త్రధారిణియై, చేతిలో వీణను ధరించి, పుస్తకము, అక్షరమాలను పట్టుకుని జ్ఞానప్రదాయినిగా అమ్మవారు అటు ప్రధాన ఆలయంలోను, ఇటు మహా మండపం 6వ అంతస్తులో భక్తులను అనుగ్రహించనున్నారు.

 ఉదయం నుండే భక్తులు ఈ విశేష అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చు.

 

సామూహిక అక్షరాభ్యాసములు:

చిన్నారులకు విద్యాభ్యాసం ప్రారంభించడానికి శ్రీ పంచమి అత్యంత ప్రశస్తమైన రోజు కావడంతో, దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం సామూహిక అక్షరాభ్యాసములు ఏర్పాటు చేశారు.

మల్లికార్జున మహామండపం 6 వ అంతస్తులో 

 ఉదయం 07:00 గంటల నుండి ప్రారంభమవుతాయి.

దేవస్థానం యాగశాల లో శ్రీ సరస్వతి యాగం నిర్వహించబడును.

 

 అక్షరాభ్యాసానికి కావలసిన పలక, బలపం మరియు ఇతర పూజా సామాగ్రిని దేవస్థానమే సమకూరుస్తుంది.

 

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమైనది. భక్తులకు ఉచిత ప్రసాదం మరియు తాగునీటి సౌకర్యం కల్పించబడింది. వసంత పంచమి రోజున సరస్వతీ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము.

ఈ సందర్బంగా విద్యార్థులకు దేవస్థానం నుండి ఇచ్చుట నిమిత్తం పెన్ను, అమ్మవారి చిత్రం, కుంకుమ తదితరముల ప్యాకింగ్ మహా మండపం 4 వ అంతస్తులో ఫెస్టివల్ సెక్షన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది.

 

సదా శ్రీ దుర్గా మల్లేశ్వరుల సేవలో...

 

చైర్మ

న్, కార్యనిర్వహణా ధికారి.

Search
Categories
Read More
Telangana
రామనగర్‌లో పర్యటించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.. సమస్యలపై ఆరా.,|
● మురుగునీటి కాలువల సమస్యకు పరిష్కారం చూపాలని సూచన ● దెబ్బతిన్న విద్యుత్ స్తంభం స్థానంలో కొత్తది...
By Sidhu Maroju 2026-08-12 11:01:22 0 133
Andhra Pradesh
స్టాలిన్ యుహాత్మక అడుగు
*`స్టాలిన్ వ్యూహాత్మక అడుగు !_*   _డీఎంకే ఎమ్మెల్యేలకు చెన్నై విడిచి వెళ్లొద్దని ఆదేశాలు_...
By Rajini Kumari 2026-05-08 13:42:46 0 141
Telangana
రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణాలు కాపాడుతున్న నిశ్శబ్ద పోరాట యోధులు!
నేడు '108 పైలట్ల' దినోత్సవం సందర్బంగా వారికి శుభాకాంక్షలు ​ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుల్లా...
By Bheeshman King 2026-05-26 10:05:27 0 1K
Andhra Pradesh
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మెరిసిన ఆణిముత్యాలు (Z
పుంగనూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షల్లో శహవార్ 600కు 592 మార్కులతో స్కూల్...
By Kothuru Murali 2026-05-01 12:32:37 0 139
Telangana
"అతి శబ్దం చేస్తే అంతే సంగతులు: ఒక్క రోజే 182 కేసులు, రూ. 2.44 లక్షల జరిమానా.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర రోడ్లపై అతి శబ్దంతో ప్రయాణిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న...
By Sidhu Maroju 2026-04-20 16:52:40 0 387
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com