Jagan Mohan Reddy: జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్.

0
186

ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానన్న వైఎస్ జగన్

ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ అవుతానని వెల్లడి

ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్న జగన్

ఏలూరులో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ఏ వర్గానికీ మేలు చేయలేదని విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, “జగన్ ఉంటే బాగుండేదని” ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి మిగిలింది ఇంకో మూడేళ్లేనని అన్నారు.

 

ఇక తాను ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్ స్పష్టం చేశారు. ఈ ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని, ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గంతో మొదలు పెడుతున్నామని తెలిపారు.

 

చంద్రబాబు పాలన మొత్తం అబద్ధాలు, మోసాలేనని ఆరోపించిన జగన్.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఎవరితోనైనా ఎలా కావాలంటే అలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

 

అలాగే, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారిందని జగన్ అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు డిమాండ్ ఉండేదని, ఇప్పుడు విద్యార్థులు భారీగా చదువు మానేస్తున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీలను కూడా ఈ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని జగన్ ఆరోపించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
గురువారం సాయంత్రం పుంగనూరు మండలం, సుగాలిమిట్ట వద్ద మదనపల్లె నుంచి పుంగనూరుకు వస్తున్న కారులో...
By Kothuru Murali 2026-04-03 09:50:59 0 183
Andhra Pradesh
గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటం
బొబ్బిలి గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో...
By Boiena Rajesh 2026-03-29 04:14:13 0 242
Andhra Pradesh
జాతి నిర్మాణంలో ఆంధ్రా యూనివర్సిటీది కీలక పాత్ర: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) కేవలం ఒక విద్యా ప్రాంగణం కాదని, వ్యక్తిత్వంతో, విలువలతో జాతి నిర్మాణంలో...
By Pagadala Venkateswar 2026-04-09 04:53:46 0 183
Telangana
పంట కోత మాటున.. బంగారు గొలుసుల కోత.|
● వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా ● ముగ్గురు అరెస్ట్.. 8...
By Sidhu Maroju 2026-07-29 16:21:23 0 274
SURAKSHA
Shri Jaspal Singh IPS: A Legacy of Courage and Leadership
From safeguarding national security to leading major policing reforms, Shri Jaspal Singh, IPS has...
By Lokeshwari Panthadi 2026-07-21 04:51:42 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com