Nara Lokesh: ఏపీకి రావాలంటూ ఫిన్‌టెక్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ సంస్థలకు ఆహ్వానం... దావోస్‌లో వ్యాపార దిగ్గజాలతో లోకేశ్ చర్చలు.

0
178

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి లోకేశ్ బిజీబిజీ

విశాఖలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు జెరోధాకు ప్రతిపాదన

గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాలపై జపాన్ సంస్థ 'జెరా'తో కీలక చర్చలు

విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని స్కేల్ ఏఐకి ఆహ్వానం

ప్రతిపాదనలను పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించిన గ్లోబల్ కంపెనీలు

ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రాన్ని టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో కీలక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్య, ఆర్‌టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో తన పర్యటనను వేగవంతం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో భాగంగా ఆయన ఫిన్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత సంస్థల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, స్పష్టమైన ప్రతిపాదనలతో వారిని ఏపీకి ఆహ్వానించారు.

 

విశాఖలో టెక్ హబ్.. జెరోధాకు ప్రతిపాదన

ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ 'జెరోధా' ఫౌండర్ నిఖిల్ కామత్‌తో మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నాన్ని ఫిన్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా అక్కడ ఒక టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్లాట్‌ఫామ్ ఇంజనీరింగ్, బ్యాకెండ్ సిస్టమ్స్, ట్రేడింగ్ అల్గోరిథంలు, డేటా అనలిటిక్స్‌పై ఈ కేంద్రం దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో భాగస్వామ్యం కావాలని, యువ పారిశ్రామికవేత్తలకు లీడ్ మెంటర్‌గా వ్యవహరించాలని ఆహ్వానించారు. 

 

Search
Categories
Read More
Andhra Pradesh
రేపు మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం... పీఎంఓ అధికారిక ప్రకటన విడుదల.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (ఆగస్టు 1) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ...
By Pagadala Venkateswar 2026-07-31 10:00:26 1 155
Andhra Pradesh
మదనపల్లెలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లె సర్వబోధన...
By Pagadala Venkateswar 2026-07-08 11:27:40 0 115
Andhra Pradesh
Venkaiah Naidu: నేతల నోట బూతు మాటలు.. వెంకయ్యనాయుడు ఆసక్తికర స్పందన.
కొంతమంది రాజకీయ నాయకులకు బూతులు మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయిందన్న వెంకయ్య నాయుడు కొందరు...
By Pagadala Venkateswar 2026-02-08 11:35:08 0 221
Telangana
మిలాదున్నబీ వేడుకలు
నిర్వహణ నిజామాబాద్: పవిత్ర మిలాదున్నబీ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు జష్నే మిలాదున్నబీ...
By Sadaq Sadaq 2026-08-26 07:50:57 0 159
Andhra Pradesh
నెల్లూరు మహానాడు ఏర్పాట్లపై కీలక సమావేశానికి హాజరైన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పార్థసారధి గారు తిరుపతి ఎయిర్పోర్టులో గనస్పాగతం
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం కిసాన్ సేస్ వద్ద ఈనెల 27 28 29 తేదీల్లో...
By Benguluri Madhubabu 2026-05-13 06:22:26 0 252
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com