నేతన్నలకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మరో గుడ్ న్యూస్

0
197

*నేతన్నలకు ‘త్రిఫ్ట్’ గిఫ్ట్*

* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

* 2025-26కు సంబంధించి మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల

* 133 సహకార సంఘాల ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ

* 5,726 మందికి లబ్ధి 

* 2 నెలల వ్యవధిలో రూ.9 కోట్లకు నిధులు పైగా నేతన్నలకు అందజేత : మంత్రి సవిత

* త్రిఫ్ట్ నిధుల విడుదలపై సహకార సంఘాల ప్రతినిధుల హర్షం

* సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు

*అమరావతి* : నేతన్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మరో గుడ్ న్యూస్ అందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత త్రిఫ్గ్ ఫండ్ నిధులను జారీచేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలియజేశారు. చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేశామన్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. ఏటా రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు అందజేస్తామని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రిఫ్గ్ ఫండ్ నిధులను విడుదల చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 5,726 మంది నేతన్నలకు లబ్ధి కలుగనుందన్నారు. ఈ నెలలోనే సంక్రాంతి ముందు ఆప్కో ద్వారా రూ.5 కోట్లు బకాయిలను చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. గడిచిన డిసెంబర్ లో కూడా రూ.2.42 కోట్ల మేర ఆప్కో బకాయిలు చెల్లించిన విషయాన్ని కూడా మంత్రి గుర్తు చేశారు. ఇలా కేవల రెండు నెలల వ్యవధిలో రూ.9 కోట్లకుపైగా నిధులను చేనేత సహకార సంఘాలకు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన జీవనంతో కూడిన ఉపాధి కల్పించడమే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లక్ష్యమని మంత్రి సవిత ఆ ప్రకటనలో వెల్లడించారు. మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల చేయడంపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
స్వర్ణాంధ్ర-2047 థీమ్‌తో అమరావతిలో పంద్రాగస్టు సంబరాలు..జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా...
By Pagadala Venkateswar 2026-08-15 09:48:33 0 88
Andhra Pradesh
సీఎంకి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు...
By Boiena Rajesh 2026-02-28 11:17:06 0 229
Andhra Pradesh
పుంగనూరులో పర్యటించిన స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో శనివారం స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు కేజీ పద్మలత, జిల్లా...
By Kothuru Murali 2026-04-05 07:43:50 0 197
Andhra Pradesh
పొలిటికల్ పార్టీ లతో ఆర్డిఓ గారు సమావేశం
చీరాల: ఈరోజు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పొలిటికల్ పార్టీల...
By Gadiyapudi Narendra 2026-03-26 17:23:08 0 583
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు  ప్రైవేట్ , కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా...
By Boya Dasthagiri 2026-05-05 16:19:54 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com