Chandrababu Naidu: జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబుకు తెలుగువారి ఆత్మీయ స్వాగతం పలికారు.

0
231

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం చంద్రబాబు

జ్యూరిచ్‌లో సీఎంకు ఘనంగా స్వాగతం పలికిన ప్రవాస తెలుగువారు

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నాలుగు రోజుల పర్యటన

సీఎంతో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. జనవరి 19, సోమవారం ఉదయం ఆయన జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకోగా, యూరప్‌లోని ప్రవాస తెలుగువారు, ఎన్నారై టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ కూడా ఉన్నారు.

 

అనంతరం జ్యూరిచ్‌లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "జ్యూరిచ్‌లో నాకు ఆత్మీయ స్వాగతం పలికిన తెలుగు వారికి, ఎన్నారై టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు. యూరోప్‌లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా జ్యూరిచ్ వచ్చి నా పట్ల చూపిన అభిమానానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మన తెలుగు భాషకు, సంస్కృతికి ప్రతీకలైన మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉంది," అని అన్నారు.

 

జనవరి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో 'బ్రాండ్ ఆంధ్రప్రదేశ్' ను ప్రపంచానికి పరిచయం చేసి, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు 36 సమావేశాల్లో పాల్గొననున్నారు. అంతకుముందు జ్యూరిచ్ విమానాశ్రయంలో సింగపూర్ దేశాధ్యక్షుడు షణ్ముగరత్నం, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు తన ప్రతినిధి బృందంతో కలిసి రోడ్డు మార్గంలో దావోస్‌కు బయల్దేరి వెళ్లారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: లోకేశ్‌కు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు.
లోకేశ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం  పాఠశాలల్లో మౌలిక వసతులు,...
By Pagadala Venkateswar 2026-01-23 05:49:46 0 207
SURAKSHA
Vinay Kumar, IPS: Leading Bihar Police with Vision & Valor
The Journey Begins "Leadership in policing is not measured by authority...
By Fathima Safa 2026-08-01 11:40:30 0 284
Telangana
మంచిర్యాల: చిన్నారులతో క్రికెట్ ఆడిన ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం ఉదయం మంచిర్యాలలో సందడి చేశారు మార్నింగ్ వాక్ లో భాగంగా...
By Bonagiri RaviShankar 2026-06-14 13:49:09 0 238
Andhra Pradesh
మహిళల మాన ప్రాణాలకు భద్రత లేదా. - జిల్లాలో శాంతిభద్రతలు కరువు. - కూటమి పాలనలో రక్షణ లేని రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రం - పూజిత.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా...
By Ratna Sekhar 2026-03-11 07:09:39 0 682
Telangana
"భద్రతపై అల్వాల్ పోలీసుల చైతన్యం: ఏఆర్కే అపార్ట్‌మెంట్స్‌లో ‘మీ సురక్ష’ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి జోన్ పరిధిలోని అల్వాల్ ఏఆర్కే అపార్ట్‌మెంట్స్...
By Sidhu Maroju 2026-05-25 03:40:41 0 365
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com