విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా వంగలపూడి అనిత గారి ఘన నివాళి

0
414

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) గారి వర్థంతి సందర్భంగా విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా వెండితెరను ఏలిన కథానాయకుడిగానే కాకుండా, ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రిగా, పేదల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసిన మహానాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రపుటల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలను భయపెట్టే యంత్రం కాదని, ప్రజలకు అండగా నిలిచే వ్యవస్థ అనే భావనను నాటిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. అలాంటి మహానాయకుడ్ని చూస్తూ తాను ఎదిగానని, ఈ రోజు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించడం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని మంత్రి అనిత పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. తెలుగు ప్రజల కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అనిత స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ ఏర్పాటు మీకు ఇష్టం లేనప్పుడు తెలంగాణ ఓట్లు ఎందుకు ?తెలంగాణలో అధికారం ఎందుకు ?
ఈటల రాజేందర్ గారు.... మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమం చేసి ఆనాటి కేసిఆర్ ప్రభుత్వంలో...
By Ponnala Srinivasrao 2026-05-10 02:08:41 0 167
Telangana
SI's charity for children who lost their mother!
MAHABUBABAD/KOTHAGUDA::Manemma, a resident of Kothaguda Mandal Center, recently passed away due...
By Bheeshman King 2026-07-03 07:55:18 0 618
Bharat Aawaz
Supreme Court on Article 21: Don’t Delay Justice, It Costs Freedom
The Supreme Court has reminded that Article 21 the right to life and personal liberty is the...
By Citizen Rights Council 2025-07-23 13:44:34 0 2K
Telangana
Petrol shortage fake news
ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో పెట్రోల్ కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం. అధికారిక వర్గాల...
By Kamble Amardeep 2026-03-25 14:45:53 0 517
SURAKSHA
Shivdeep Lande: The Fearless IPS Officer Who Inspired Bihar
The Journey Begins "The uniform is not a symbol of power—it is a promise to protect the...
By Fathima Safa 2026-08-03 07:02:47 0 455
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com