రోడ్డు భద్రతలపై ప్రజలకు అవగాహన : కర్నూలు జిల్లా పోలీసులు
కర్నూలు : కర్నూలు జిల్లా
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం ...
కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు.
డిఐజి , కర్నూలు ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.
ప్రతి శనివారం రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు, డిఐజి , కర్నూలు ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారులు ఆదేశాలు జారీ చేశారు.
వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ సంధర్బంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత , ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు.
మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా , ఓవర్ స్పీడ్ , ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతల పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఒక ప్రకటన లో తెతెలియజేశారు
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz