ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు : కర్నూలు ఎస్పీ

0
190

కర్నూలు : కర్నూలు జిల్లా :

ప్రభుత్వ పథకాల పేరుతో  సైబర్‌ నేరగాళ్ల మోసాలు...

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

మోసపోవడానికి ప్రధాన కారణం.... అత్యాశ, అశ్రద్ద...మోసగాళ్ళ మాటలు నిజమని నమ్మకండి.

పథకాల పేరుతో వచ్చే  తెలియని  ఫేక్ లింకులను క్లిక్‌ చేయవద్దు.

బ్యాంకు ఖాతాల ఓటిపిలు చెబితే మోసపోతారు... జాగ్రత్త!

...డీఐజీ , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ !! 

ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్‌, ముద్ర లోన్స్‌, సూర్యఘర్‌, అమ్మవడి వంటి పథకాల పేరుతో  సోషల్ మీడియాలో  ఫేక్ లింకులను పంపి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు శుక్రవారం తెలిపారు. 

‘ఇది  ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. మీకు రూ. లక్షలలో  రాయితీ’ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు.

ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారని,  ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. 

ఆయా పథకాల పేరుతో మొబైల్ కు వచ్చే తెలియని , ఫేక్ల్ లింకులను క్లిక్‌ చేయవద్దన్నారు. 

ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
 

డిఐజి ,  జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ గారి  సూచనలు...

- అపరిచిత లింకులను నమ్మవద్దు.

-  ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలి. 

- వ్యక్తిగత సమాచారం షేర్‌ చేయవద్దు. బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు.

- అపరిచిత కాల్స్‌ వస్తే 1930 నంబరుకు కాల్‌ చేయాలి. అదేవిధంగా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి.

- ఇలాంటి మోసాల గురించి కుటుంబసభ్యులు, స్నేహితులకు తెలియజేసి సైబర్‌ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచాలి.

- ప్రభుత్వ పథకాల సమాచారం కోసం www.gov.in, nic.in లాంటి అధికారిక డొమైన్‌లను మాత్రమే ఉపయోగించాలి అని ఒక ప్రకటనలో తెలియజేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
బాలిక రిషిక ప్రియా హత్య కేసు: నిందితుడు ఆత్మహత్య, ప్రజల సంబరాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం...
By Pagadala Venkateswar 2026-02-18 06:46:00 0 160
Andhra Pradesh
ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన.
  ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన...
By Pagadala Venkateswar 2026-06-06 06:09:07 0 84
Andhra Pradesh
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసిన దొంగల అరెస్టు...
  పొన్నూరు: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్ చింతలపూడి గ్రామంలో పొన్నూరు...
By Gadiyapudi Narendra 2026-02-24 17:18:35 0 467
Andhra Pradesh
బాపట్లలో రెడ్ క్రాస్ ట్రైనింగ్ ఛాంబర్ ప్రారంభోత్సవం బాధితుల చిరునామా రెడ్ క్రాస్: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
    బాపట్ల జిల్లా: బాధిత జనావళికి అండగా, వారికి బాసటగా రెడ్ క్రాస్ స్వచ్ఛంద...
By Gadiyapudi Narendra 2026-02-17 16:16:55 0 202
Business & Finance
Correct Trademark Errors with Trademark Rectification
Trademark rectification is the legal process of correcting, updating, or removing errors in the...
By Navya Sree 2026-07-18 06:37:00 0 38
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com