పరిశుద్ధ కార్మికుల భద్రత ప్రాధాన్యాలు !! కమిషనర్

0
201

కర్నూలు : కర్నూలు సిటీ : 

పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• కార్మికులకు 21 రకాల పనిముట్ల అందజేత

నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో పాటు పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం బి.క్యాంపు శానిటేషన్ స్టోర్‌ వద్ద రూ.82 లక్షల వ్యయంతో పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన 21 రకాల రక్షణ సామగ్రి, పనిముట్లను అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ కఠిన పరిస్థితుల్లో శ్రమిస్తున్నారని, వారి భద్రత, ఆరోగ్య రక్షణ నగరపాలక సంస్థకు అత్యంత ముఖ్యమని కమిషనర్ పేర్కొన్నారు. సరైన పనిముట్లు, రక్షణ సామగ్రి అందుబాటులో ఉంటే పని సామర్థ్యం పెరుగుతుందని, వ్యాధుల నివారణతో పాటు నగరంలో పరిశుభ్రత ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. రూ.82 లక్షలతో 21 రకాల పనిముట్లు కొనుగోలు చేసి కార్మికులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. 49 పుష్ కార్ట్‌లు, ఎప్రాన్‌లు, మాస్కులు, చేతి గ్లౌజులు, రెయిన్ కోట్లు, చెత్త డబ్బాలు, టబ్‌లు, గడ్డ పారలు, చిన్న సైజు ఇనుప రేకులు, రేకు బొంగులు, పిక్ యాక్స్, కొడవళ్లు, సాలికలు, ట్రాక్టర్ కప్పేందుకు నెట్లు, పెద్ద సైజు పంజాలు, గొడ్డళ్లు, టాయిలెట్ బ్రష్‌లు, నాఫ్తలిన్ బంతులు వంటి మొత్తం 21 రకాల పనిముట్లు కలిపి 39,809 పనిముట్లు పారిశుద్ధ్య కార్మికులకు అందజేసినట్లు వెల్లడించారు.

Search
Categories
Read More
Business & Finance
Before You Launch Apply for a Provisional Patent
A provisional patent application helps inventors secure an early filing date while providing time...
By Navya Sree 2026-07-13 06:55:57 0 82
SURAKSHA
Future-Ready Force: Jharkhand’s Elite Police Training
The Jharkhand Police department is actively transforming its operational capabilities through a...
By Lokeshwari Panthadi 2026-07-04 11:49:17 0 176
Andhra Pradesh
బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాగునీటి ట్యాంకర్లు నీరు అందించడం.
    _బుట్టా ఫౌండేషన్ చొరవతో బి. అగ్రహారం, పరమాన్ దొడ్డి గ్రామాలకు మంచినీటి ట్యాంకర్లు...
By Boya Dasthagiri 2026-03-27 00:40:41 0 287
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె బస్టాండ్‌లో 48 గ్రాముల బంగారు నెక్లెస్ పోగొట్టుకున్న బాధితురాలు. వెంటనే స్పందించి గంటలోపే నెక్లెస్‌ను గుర్తించి అప్పగించిన 2 టౌన్ పోలీసులు.
మదనపల్లె: మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో పోగొట్టుకున్న సుమారు 48 గ్రాముల బంగారు...
By Pagadala Venkateswar 2026-07-16 05:40:50 0 31
Assam
Aponar Apon Ghar Scheme Boosts Affordable Housing
The Assam Government's Aponar Apon Ghar Scheme aims to make home ownership more accessible for...
By Fathima Safa 2026-06-24 05:47:31 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com