విజయవాడ గొల్లపూడి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

0
215

*పత్రికా ప్రకటన*

*విజయవాడ, తేదీ: 14.01.2026*

 

*• గొల్లపూడిలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు*

*• భోగి మంటలు అంటేనే చెడును విడిచి మంచిని ఆహ్వానించడం

*. తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు

*- సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి*

 

 గత ప్రభుత్వంలో జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలతో రైతులు ఎదుర్కొన్న క్షోభను త్యజించి వాటిని సంక్రాంతి భోగి మంటల్లో వేసి కొత్త ఆశలకు నాంది పలుకుతున్నారని సమాచార, పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 

తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడి వన్ సెంటర్ వద్ద అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన భోగి వేడుకల్లో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. రైతుల జీవితాల్లో అనిశ్చితి, అవమానాలకు కారణమైన పాత పట్టాదారు పాసుపుస్తకాలను త్యజించి, ప్రభుత్వం రాజముద్రతో జారీ చేస్తున్న నూతన పట్టాదారు పాసుపుస్తకాలను స్వీకరించడం రైతులు ఆనందంతో ఉన్నారన్నారు. భోగి మంటలు అంటేనే చెడును విడిచి మంచిని ఆహ్వానించే సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. అదే భావంతో రైతులు తమ బాధాకర అనుభవాలకు ముగింపు పలుకుతూ కొత్త నమ్మకం, భరోసాతో ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యంగా ముందుకు వెళ్లుతుందన్నారు. సంక్రాంతి పండుగకు వేలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకి వచ్చి పండుగ చేసుకుంటారన్నారు. గత ప్రభుత్వంలో రైతులు చాలామంది రైతులు పట్టాదారు పుస్తకాల విషయంలో క్షోభ పడ్డారన్నారు. రైతుల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలు అందిస్తుందన్నారు. రైతులు పాత పట్టాదార్ పాస్ పుస్కకాలను బోగి మంటల్లో వేసి పండుగ జరుపుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంచి పాలనను అందిస్తున్నారన్నారు. ధాన్యం డబ్బులను 24 గంటల్లో రైతు ఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.. రాష్ట్రంలో యువతీయువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తుందన్నారు. తెలుగు ప్రజల జీవితాల్లోని కష్టాలు భోగి మంటల్లో దగ్దమై, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతి సమృద్ధి వెల్లివెరియాలని ఆకాంక్షించారు.. అందరి మనోభావాలను గతంలో దెబ్బతీసారని.. అలాంటి ఆలోచనలు మంటల్లో కాలిపోవాలని ఆశిస్తున్నానని మంత్రి కొలుసు పార్థసారధి తెలియజేసారు.  

 

శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజలందరూ శాంతి, సుస్థిరతలతో సంక్రాంతి జరుపుకుంటున్నారు. భోగి మంటల్లో పాత పుస్తకాలను వేసి భోగి పండుగను జరుపుకుంటున్నారన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని, ప్రతి కుటుంబంలో పండుగ వెలుగులు నిండాలని శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు.

 

ముందుగా గొల్లపూడి వన్ టౌన్ సెంటర్ లో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లు కలిసి సంప్రదాయబద్ధంగా భోగి మంటలను వెలిగించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు - ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్.
పర్యావరణ పరిరక్షణకై ప్రభుత్వం నిర్దేశించిన 120 మైక్రోన్ల కన్నా తక్కువ స్థాయి ప్లాస్టిక్ ఆధారిత...
By Ratna Sekhar 2026-03-11 07:32:12 0 549
Telangana
పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల నియోజకవర్గం : లక్షెట్టీపేట్ మండల హన్మంతుపల్లి గ్రామానికి చెందిన D. లావణ్య ఆరోగ్య ఖర్చుల...
By Avunoori Mahesh 2026-04-13 14:54:14 0 222
Telangana
పేద ప్రజల వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే శ్రీ గణేష్
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిమ్స్ హాస్పటల్ లో వైద్య ఖర్చుల కోసం...
By Sidhu Maroju 2025-09-09 14:46:45 0 367
Telangana
"అల్వాల్‌, బొల్లారం లో ఆగని దొంగల 'షికారు': రెండ్రోజుల్లో రెండు బైకులు మాయం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర శివార్లలోని అల్వాల్.. బొల్లారం పరిసర ప్రాంతాల్లో వాహన దొంగలు...
By Sidhu Maroju 2026-04-15 16:27:48 0 421
SURAKSHA
Rajasthan Police Strengthen Measures for State Law & Order
The Rajasthan Police are heavily prioritizing the maintenance of law and order across the state's...
By Lokeshwari Panthadi 2026-07-04 08:10:37 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com