ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించండి

0
266

*విజయవాడ నగరపాలక సంస్థ*

 

*12-01-2026*

 

*ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించండి*

 

ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించమని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని, అర్జీదారులకు వారి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందిస్తామన్న భరోసాని ఇవ్వడమే కాకుండా సత్వరమే అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 12 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 2, ఇంజనీరింగ్ 4, పబ్లిక్ హెల్త్ 2, యుసిడి 3, ఎస్టాబ్లిష్మెంట్ 1 మొత్తం కలిపి 12 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.

 

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, చీఫ్ ఇంజనీర్ i/c పి సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, డిఎఫ్ఓ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి. 

 

*పౌర సంబంధాలు అధికారి*

 

*విజయవాడ నగరపాలక సంస్థ*

Search
Categories
Read More
Telangana
మచ్చబొల్లారంలో మిలాద్ వేడుకలు.|
● ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● మహమ్మద్ ప్రవక్త సందేశాలను గుర్తుచేసిన...
By Sidhu Maroju 2026-08-26 12:05:52 0 125
Sports
DOUBLE CENTURY FOR CAPTAIN GILL! 🤩
The first ever Asian captain to score a double-century in SENA countries! 🇮🇳 It's the dawn of a...
By Bharat Aawaz 2025-07-03 13:36:03 0 4K
BMA
Defending Independent Journalism Against Fake News
While combating misinformation is crucial, the Indian press is fiercely protecting its power...
By JoinBMA 2026-08-20 05:53:21 0 165
BMA
Policy Impact: How Patient Investigations Change Laws
While sensational breaking alerts dominate social media feeds for a day and vanish, slow...
By JoinBMA 2026-08-24 06:09:06 0 109
Telangana
కార్యకర్త నుండి దేశస్థాయికి ఎదిగిన ఉపేందరుడు
ఆదివాసీల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా... ఆటుపోటులు ఎదురైనా టార్గెట్ ఒక్కటే.... ఆదివాసులకు న్యాయం...
By Bheeshman King 2026-05-26 11:28:38 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com