గుంటూరు లాలాపేట మరియు కొత్తపేట పోలీస్ స్టేషన్లలో మాదకద్రవ్యాలు పట్టివేత.

0
624

Kvsr. Koteswararao. Guntur

 

*గుంటూరు జిల్లా పోలీస్...* *కొత్తపేట పోలీస్ స్టేషన్* *ది: 09.01.2026* _*//100 గ్రాముల లిక్విడ్ గంజాయి, 3.2 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి గారు,.//*_ 🚩 గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై పోలీస్ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. 📍 ఈ క్రమంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ Sk.అబ్దుల్ అజీజ్ గారి పర్యవేక్షణలో, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మరియు మాదక ద్రవ్యాల కార్యకలాపాలను నిరోధించేందుకు కొత్తపేట సీఐ శ్రీ ఎం. వీరయ్య చౌదరి గారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. 📍 నిన్న రాత్రి కొత్తపేట ఎస్‌ఐ శ్రీ ఎన్. రవికిరణ్ రెడ్డి గారు మరియు పోలీస్ సిబ్బంది (PCs డేగల కోటేశ్వరరావు, వి. జానీ భాష, టి. అనిల్ కుమార్, చ. శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌ఆర్ కోటేశ్వరరావు) నెహ్రూ నగర్, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ క్వార్టర్స్ ప్రాంతంలో గంజాయి మరియు MDMA డ్రగ్స్ అమ్ముతూ, సేవిస్తున్నారనే సమాచారం మేరకు రైడ్ నిర్వహించారు. 📍 రైడ్‌లో భాగంగా నెహ్రూ నగర్‌కు చెందిన పఠాన్ మున్నా మరియు చిల్లర ప్రేమ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద 100 గ్రాముల లిక్విడ్ గంజాయి మరియు 3.2 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. వెంటనే వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. 📍 అరెస్ట్ చేసిన నిందితులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారు ఇద్దరికీ 14 రోజుల న్యాయ రిమాండ్ విధించారు. 📍 కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను అమ్మినా, సేవించినా, సరఫరా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఈస్ట్ డీఎస్పీ శ్రీ స్కె. అబ్దుల్ అజీజ్ గారు హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ సి.పి. విసీ సజ్జనర్ - అర్ధరాత్రి స్వయంగస్తి.|
హైదరాబాద్ : హైద‌రాబాద్ సీపీ శ్రీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ అర్థ‌రాత్రి...
By Sidhu Maroju 2025-11-24 10:04:16 0 182
Telangana
రాజాపేట లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
రాజపేట భారత్ ఆవాజ్ న్యూస్ jun 19: రాజపేట మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు శుక్రవారం...
By Pindikura Mahesh 2026-06-20 01:13:07 0 323
Telangana
వరంగల్
    రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో గుర్తుతేయని మృతదేహం లభ్యం   ...
By Ellandula Sandeep 2026-03-05 06:52:08 0 358
Andhra Pradesh
మా ఇంటి పెద్ద కొడుకు షార్ట్ ఫిలిం లాంచ్
*పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా 'మా ఇంటి పెద్ద కొడుకు' షార్ట్ ఫిలిం లాంచ్*    ...
By Rajini Kumari 2026-03-14 11:24:32 0 192
Andhra Pradesh
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జెఎసి చైర్మన్ ఏ విద్యాసాగర్
*ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.* *సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేయాలి*...
By Rajini Kumari 2025-12-21 16:26:48 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com