జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మరోసారి సత్తా చాటిన బాపట్ల జిల్లా పోలీస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
Posted 2026-01-08 12:26:41
0
266
జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మరోసారి సత్తా చాటిన బాపట్ల జిల్లా పోలీస్ కానిస్టేబుల్
కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
బాపట్ల: బాపట్ల పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ, స్విమ్మింగ్ పోటీలలో రాణించి జిల్లా పోలీస్ కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రశంసించారు. శ్రీ రామ్ సీ స్విమ్మింగ్ క్లబ్ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రం, పోరుబందర్‌లోని అరేబియా సముద్ర తీరంలో నిర్వహించిన 'ఆల్ ఇండియా సీ స్విమ్మింగ్' పోటీల్లో కానిస్టేబుల్ పి.నాగ బ్రహ్మారెడ్డి ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ గారిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో ఎస్పీ గారు బ్రహ్మారెడ్డిని మెడల్‌తో సత్కరించి, ప్రశంసా పత్రాన్ని అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.
వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా పీజీఆర్ఎస్ (PGRS) విభాగంలో విధులు నిర్వహిస్తున్న 2013 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ పి. నాగ బ్రహ్మారెడ్డి ఇటీవల గుజరాత్ రాష్ట్రం, పోరుబందర్‌లో జనవరి 3, 4 తేదీలలో జరిగిన ఆల్ ఇండియా సీ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. జనవరి 4న జరిగిన 5 కిలోమీటర్ల స్విమ్మింగ్ పోటీని 1 గంట 40 నిమిషాలలో పూర్తి చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. జనవరి 3న జరిగిన 1 కిలోమీటర్ స్విమ్మింగ్ పోటీని 22 నిమిషాలలో ముగించి తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ నాగ బ్రహ్మారెడ్డి జాతీయ స్థాయిలో వరుసగా పతకాలు సాధించడం గర్వకారణమని కొనియాడారు. గతంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన వివిధ పోటీల్లో పాల్గొని మొత్తం 15 మెడల్స్ సాధించారని గుర్తుచేశారు. నిరంతర కృషి, పట్టుదల ఉంటేనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు. ముందుముందు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని విజయం సాధించాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు. క్రీడల ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చని, శారీరక దృఢత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది బ్రహ్మారెడ్డిని ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు పోలీస్ శాఖ తరపున ప్రోత్సాహం ఉంటుందని ఎస్పీ గారు తెలిపారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సీఐటీయూ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిభిరం
మంచిర్యాల : నస్పూర్ ప్రెస్ క్లబ్బు లో ఈనెల 13 వ తేదీన మెగా రక్తదాన శిబిరము జ్యోతిరావు పూలే మరియు...
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
శ్రీగణేష్ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్, అంబేద్కర్...
Chhattisgarh Strengthens Mining and Mineral Development
Chhattisgarh continues to reinforce its position as one of India's leading mineral-producing...
Airtight Reporting: The Power of Deep Fact-Checking
In the era of rapid digital publishing, basic fact-checking is often sacrificed for speed,...
హైడ్రా మోడల్‌కు చెన్నై ఫిదా… ₹1200 కోట్ల భూమి స్వాధీనం.|
హైదరాబాద్: నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన...