బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు.
Posted 2026-01-07 14:07:24
0
332
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు.
బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు.
జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, ముఖ్యంగా మాదకద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించిన పోలీస్ అధికారులు.
విద్యార్థి దశలోనే మాదకద్రవ్యాల వలలో చిక్కుకుంటే జీవితం అంధకారంగా మారిపోతుందని హెచ్చరించారు.
డ్రగ్స్ వాడకం కేవలం వ్యక్తిగత నష్టమే కాక సమాజానికి కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు.
విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంబించాలని తెలిపారు.
సైబర్ నేరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని, డిజిటల్ అరెస్ట్ పలు ఇతర రకాల సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పారు.
యువత భవిష్యత్తు రక్షణ కోసం బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జెర్రీ పోతుల గూడెం AITUC కమిటీ ఎన్నిక
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన, జెర్రిపోతులగూడెం గ్రామ AITUC నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది....
పుంగనూరు నియోజకవర్గ :సోమల లో ఆరోగ్య దినోత్సవం
సోమల మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం డాక్టర్ జయసింహ, డాక్టర్ ప్రదీప్ ఆధ్వర్యంలో...
టిఆర్ఎస్ పదవికి వన్నె తేవాలి
*జేఎస్ఆర్ పదవికి వన్నె తేవాలి...*
*************************
మంగళగిరి ఆర్ఆర్ టవర్స్ లోని...
వర్షపు నీటికి అడ్డుగా ఉన్న పైపులు : తొలగించిన రైల్వే అధికారులు
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషితో అల్వాల్ ఆదర్శనగర్...
మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...