చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య మృతదేహానికి రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్లు మంగళవారం ఒంగోలులో పోస్టుమార్టం నిర్వహించారు.

0
247

చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య మృతదేహానికి రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్లు మంగళవారం ఒంగోలులో పోస్టుమార్టం నిర్వహించారు.

 

చీరాల: చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య మృతదేహానికి రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్లు మంగళవారం ఒంగోలులో పోస్టుమార్టం నిర్వహించారు.కాగా సౌమ్య మృతికి డాక్టర్ రామకృష్ణ హనుమాన్,డాక్టర్ గోరంట్ల రాజేష్ లే కారణమని ఆమె తండ్రి ఏడుకొండలు, హైకోర్టు న్యాయవాది రజని మీడియాకు చెప్పటం విదితమే.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చీరాల వన్ టౌన్ పోలీసులు పోస్టుమార్టంకు వెంటనే ఏర్పాట్లు చేయించారు.కాగా పోస్టుమార్టం నివేదికను బుధవారం ఇస్తామని వైద్యులు చెప్పారని,అది వచ్చాక అందులోని అంశాలను బట్టి తమ కార్యాచరణ ప్రణాళికను రూపుదిద్దుకుంటామని హైకోర్టు న్యాయవాది రజని చెప్పారు.ఏదిఏమైనా నిర్లక్ష్యం వహించిన ఇద్దరు చీరాల డాక్టర్లను కాపాడే ప్రయత్నాలు జరిగితే కోర్టులో న్యాయం కోసం పోరాడుతామన్నారు.

చీరాలలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ రామకృష్ణ హనుమాన్,డాక్టర్ గోరంట్ల రాజేష్ ల నిర్లక్ష్యం కారణంగా సౌమ్య అనే బాలింత మృతి చెందిందని హైకోర్టు అడ్వకేట్ రజిని శనివారం మీడియాకు చెప్పారు. డిసెంబర్ 16వ తేదీ ఉదయం ఆరు గంటలకు సౌమ్యకు డాక్టర్ రామకృష్ణ హనుమాన్ కు చెందిన శంకర్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో సిజేరియన్ ఆపరేషన్ జరిగిందని, కానీ ఆమెకు సాయంత్రం వరకు స్పృహ రాకపోయినా డాక్టర్ పట్టించుకోలేదన్నారు.తదుపరి గోరంట్ల రాజేష్ ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడకు మూడు గంటలు వృధా చేశారన్నారు.చివరకు పరిస్థితి విషమించడంతో గుంటూరు తరలిస్తుండగా ఆ రాత్రి సౌమ్య మార్గమధ్యంలో మృతి చెందిందన్నారు.డాక్టర్లు కనుక ఆలస్యం చేయకుండా ఆమెను వెంటనే గుంటూరు తరలించి ఉండుంటే ఆమె బతికేదన్నారు.కేవలం ఆ ఇద్దరు వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మరణించినందున వారిపై తక్షణం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రజని డిమాండ్ చేశారు.లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.మీడియా సమావేశంలో సౌమ్య తండ్రి పి ఏడుకొండలు సిఐటియు నాయకుడు వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
కంకిపాడుCI J మురళీకృష్ణ గారు తోటి సిబ్బందికి సహాయం
కృష్ణా జిల్లా  కంకిపాడు పోలీస్    👉తోటి సిబ్బందికి ఆరోగ్యం బాగలేకపోతే మేమున్నాం...
By Rajini Kumari 2025-12-21 08:28:50 0 234
Andhra Pradesh
రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప...
By Pagadala Venkateswar 2026-04-03 06:04:33 0 182
Andhra Pradesh
చీరాలలో శక్తి యాప్ పై అవగాహన
బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు చీరాల వన్...
By Vadlamudi NagaVenkat 2026-04-28 10:31:08 0 273
Andhra Pradesh
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కాపాడం మిట్టపల్లి...
By Kothuru Murali 2026-06-29 11:29:13 0 162
Andhra Pradesh
చింతలగంగమ్మకు అద్భుత పుష్పాలంకరణ, భక్తుల ఆనందోత్సాహాలు.
పెద్దమండ్యం: శ్రీ పరభావనామ సంవత్సర చింతలగంగమ్మ తిరునాళ్ల సందర్భంగా, ఆలయ పంతులుగారు అమ్మవారిని...
By Pagadala Venkateswar 2026-07-07 04:32:50 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com