గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ శంకుస్థాపనకు గుంటూరు పశ్చిమ నుంచి భారీ బైక్ ర్యాలీతో హాజరైన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు

0
244

గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ శంకుస్థాపన కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ…

ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. పల్నాడు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు గుంటూరు నగరంలోకి ప్రవేశించకుండా నేరుగా వెళ్లేందుకు ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. దీని ద్వారా నగరవాసులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నిలిచిపోయిందని, భూసేకరణ సమస్యలు, నిధుల లేమితో పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కీలక ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసిందని తెలిపారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గుంటూరు అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పూర్తయితే, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు సూచించారు.
ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి....
By Chennaiah Kati 2026-07-08 21:31:52 0 135
Chandigarh
Chandigarh to Roll Out Monthly Parking Pass Across the City
In a move towards simplifying city transport and parking, the Chandigarh Municipal Corporation...
By Bharat Aawaz 2025-07-17 05:44:04 0 1K
Andhra Pradesh
చింతూరు బైక్ మెకానిక్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!
చింతూరు బైక్ మెకానిక్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ...
By Shyamala Yadagiri 2026-08-04 14:04:21 0 169
Andhra Pradesh
ప్రజా దర్బార్ ప్రజల సమస్య పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం యర్రగొండపాలెం నియోజకవర్గ
ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి...
By Chennaiah Kati 2025-12-27 09:10:02 0 470
Andhra Pradesh
*ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు నిర్వహించారు
*ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు...
By Chennaiah Kati 2026-02-06 15:21:48 0 382
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com