విద్యార్థుల బంగారు భవితవ్యానికి వారధి ఇంటర్మీడియట్ విద్య 

0
282

విద్యార్థుల బంగారు భవితవ్యానికి వారధి ఇంటర్మీడియట్ విద్య  విట్ తో విజిఆర్ యం విద్యాసంస్థ  అనుసంధానం  బాపట్ల విద్యార్థులకు మరో కానుక 

బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ

బాపట్ల: విద్యార్థుల ఉజ్వలమైన బంగారు భవిష్యత్తుకు వారధి ఇంటర్మీడియట్ విద్య అని, సరైన ప్రణాళిక,  క్రమశిక్షణ తోడైతే ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. 

బాపట్లలోని విజిఆర్ ఎం విద్యా సంస్థ ఆవరణలో నూతన సంవత్సర వేడుకలు మరియు విట్ జూనియర్ కళాశాలతో అనుసంధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ... 
బాపట్ల ప్రాంతానికి ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకును తీసుకువచ్చిన ఘనత విజిఆర్ఎం విద్యాసంస్థకే దక్కిందని, మళ్లీ రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు  సాధించి బాపట్ల ఖ్యాతి పెంచాలని ఆకాంక్షించారు. 

అంకితభావం క్రమశిక్షణకు మారుపేరుగా వి జి ఆర్ ఎం విద్యాసంస్థ నిలిచిందని,  ఐఐటి, జేఈఈ,  ఎంసెట్ పరీక్షలలో ఉన్నత ర్యాంకుల సాధనలో ఎంతో అనుభవం కలిగిన విట్ జూనియర్ కళాశాల వారితో అనుసంధానం కావడం శుభ పరిణామం అన్నారు. 

బాపట్ల ప్రాంత పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు సాధారణ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ కళాశాలలకు ధీటైన విద్యను అందిస్తున్న వీజీఆర్ఎం విద్యాసంస్థల పనితీరు ప్రశంసనీయమని అభినందించారు. 

వి జి ఆర్ ఎమ్ కళాశాల డైరెక్టర్ అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ..   బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ చేతుల మీదుగా విట్ జూనియర్ కళాశాలతో అనుసంధానం జరగడం తమకు శుభశకునంగా అదృష్టంగా భావిస్తామన్నారు. 

2013లో ఆవిర్భవించిన తమ విద్యాసంస్థ గడచిన 12 సంవత్సరాలుగా స్టేట్ ఫస్ట్ సహా,  అనేక రాష్ట్రస్థాయి ర్యాంకులను బాపట్ల బాట పట్టించిన తమ కళాశాల విట్ విద్యాసంస్థల అనుబంధంతో రాబోయే రోజులలో ఐఐటి, జేఈఈ,  ఎంసెట్లో మరిన్ని ఉత్తమ ర్యాంకులను సాధించి బాపట్ల ప్రజలకు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

నూతన సంవత్సర శుభవేళ తమ కళాశాల తీసుకున్న నూతన అనుసంధాన నిర్ణయం ద్వారా మరింత పురోగతిని నమోదు చేసి, మరొక్క మారు తమను తాము నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 

విట్టు విద్యాసంస్థలో అధ్యాపక వర్గం గురించి చెప్పాలంటే రాష్ట్రస్థాయిలో అనేక పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు మెటీరియల్ ను, సిలబస్ ను  రూపొందించి ఇచ్చిన ఘన చరిత్ర కలిగిన వారని, అలాంటి నిపుణుల శిక్షణ పర్యవేక్షణలో తప్పనిసరిగా ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు. 

ఈ కార్యక్రమంలో విట్ విద్యాసంస్థ తరపున కేఎస్ఆర్,  డిఎస్ఆర్, రాఘవ, విజిఆర్ఎం తరఫున డైరెక్టర్లు అంబటి గిరిధర్ కుమార్ ఆదెళ్ళ విజయ్ కుమార్ ఇంకా బాపట్ల పరిసర ప్రాంతాల నుండి వివిధ విద్యాసంస్థల పాఠశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
రైతులను వైకాపా మోసం చేసిందన్న కేంద్ర సహాయ మంత్రి
ఆచంట, పెనుగొండ: గత ఐదేళ్ల వైకాపా పాలనలో రైతులను పూర్తిగా మోసం చేశారని కేంద్ర సహాయ మంత్రి...
By Bharat Aawaz 2025-08-14 10:24:38 0 878
Manipur
Kamjong Conflict: Border Tension and Arson Reported
A disturbing resurgence of violence has gripped the Kamjong district along the India-Myanmar...
By Lokeshwari Panthadi 2026-07-02 05:41:52 0 78
Andhra Pradesh
హజ్రత్ సయ్యద్ షాబుకారీ బాబా ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు
*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2025-12-26 10:10:36 0 265
Telangana
మంచిర్యాల: చెక్ బౌన్స్.. భార్యాభర్తలకు శిక్ష ..
చిల్లను చెక్కు ఇచ్చిన కేసులో రాచపూడి లలిత లక్ష్మీనారాయణ దంపతులు ఏడాది జైలు శిక్ష, తీసుకున్న రూ.60...
By Bonagiri RaviShankar 2026-06-10 07:22:16 0 223
Andhra Pradesh
పుంగనూరు: ఘాట్ రోడ్లో పల్టీలు కొట్టిన కారు
పులిచెర్ల మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొద్దుటూరు పట్టణానికి చెందిన సరస్వతమ్మ,...
By Kothuru Murali 2026-04-16 17:11:02 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com