పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. 

0
281

పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. 
చీరాల: రాష్ట్రంలో ఎన్టీఆర్‌ సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారికి ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు అన్నారు., చీరాల మండలం  ఓడరేవు గ్రామం, వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం పంచాయితీ తుఫాన్ పేటలో ఆయన కూటమి నాయకులతో కలిసి ఎన్టీఆర్‌ సామాజిక పెన్షన్లను  అర్హులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోందని, అయితే జనవరి 1వ తేదీన జరిగాల్సిన పంపిణీ నూతన సంవత్సరం సెలవు కారణంగా ఒక రోజు ముందుగానే అర్హులకు పెన్షన్లు అందించడం జరుగుతోందన్నారు. కొత్తగా మంజూరైన పెన్షన్లును అర్హులకు ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతోందన్నారు. కాగా ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా ప్రతి నెలా ఖచ్చితంగా ఒకటవ తేదీనే పెన్షన్లను అర్హుల ఇళ్ల వద్దకే వెళ్లి అందిచడం జరుగుతోందన్నారు. గడిచిన 18నెలల్లో ఇప్పటివరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద 677 మందికి రూ.6.58కోట్ల సాయం అందించామని, చీరాల చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని అన్నారు. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పారదర్శకతకు నిదర్శనమన్నారు. గతంలో సీఎం ఆర్‌ ఎఫ్‌  చెక్కు కోసం ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం అలాంటిదేమీ లేదన్నారు. గత వైసిపి హయాంలో ఒక్కటంటే ఒక్క చెక్కు ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జ‌ర్నీ!
    APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జ‌ర్నీ!...
By Pagadala Venkateswar 2026-02-10 04:35:19 0 199
SURAKSHA
డిజిటల్ పౌరులుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం మన కర్తవ్యం
డిజిటల్ ప్రపంచం అపారమైన అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, అది బాధ్యతలతో కూడినదని గుర్తుంచుకోవాలి....
By Kalaga Sailaja 2026-06-24 09:29:46 0 113
Telangana
తవకాలలో బయట పడ్డ 2వ శతాబ్దపు వస్తువుల
నేలకొండపల్లి బౌద్ధస్థూపం వద్ద పురావస్తు శాఖ జరిపిన తవకాలలో 2వ శతాబ్దంనికి చెందిన పళ్ళు వస్తువుల...
By Krishna Balina 2026-01-18 04:45:43 0 519
SURAKSHA
AP పోలీసులు రక్తదానం: ప్రాణాలు కాపాడే సేవ
 AP పోలీస్ శాఖ ఈరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రితో కలిసి భారీ రక్తదాన శిబిరం నిర్వహించింది....
By Kalaga Sailaja 2026-07-06 05:38:54 0 265
SURAKSHA
సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ పోలీసుల అవగాహన కార్యక్రమాలు
సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన...
By Kalaga Sailaja 2026-06-24 07:53:51 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com