గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి ని ఢీ కొట్టడం తో వ్యక్తి మరణానికి కారణంగా నిరూపించటంతో జైలు శిక్ష.

0
673

గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ : 30.12.2025* _*//రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైన కేసులో ఆటో డ్రైవర్ కు 22 నెలల జైలు శిక్ష,రూ.10,000/- జరిమానా,.//*_ *🔰కేసు వివరాలు :* ది.07.10.2018న తెల్లవారుజామున నిందితుడు తన ఆటోను చేబ్రోలు నుండి ముట్లూరు వైపు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ, ఎదురు దిశ నుండి టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్ (వాహనం నం. AP07UTTR8412) పై ప్రయాణిస్తున్న కొచర్ల.హృదయరాజు (48 సంవత్సరాలు)ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హృదయరాజు తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ 12.10.2018 సాయంత్రం 7.03 గంటలకు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి అప్పటి డి.అశోక్ గారు Cr.No: 140/2018, Sec 304-A IPC, 180, 181 of Motor vehicles act. కింద కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు జరిపి, కోర్టు వారికి సాక్ష్యాధారాలను సమర్పించారు.తదుపరి ఈ కేసులో ప్రస్తుత సీఐ రామా నాయక్ గారు మరింత సమగ్ర దర్యాప్తు జరిపి, కారులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినారు. 🔰 సాక్ష్యాధారాలను పరిశీలించిన గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, గుంటూరు గారు నిందితుడిని Cr.P.C సెక్షన్ 255(2) ప్రకారం దోషిగా నిర్ధారించి,1 సంవత్సరం 10 నెలల సాధారణ కారాగార శిక్ష మరియు రూ.10,000/- జరిమానా (జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 1 నెల సాధారణ కారాగార శిక్ష). *🔰 నిందితుడు వివరాలు :* పలపర్తి.సత్యనారాయణ, తండ్రి వెంకటేశ్వర్లు (45 సంవత్సరాలు) ముట్లూరు గ్రామం, (ఆటో డ్రైవర్ – వాహనం నం. AP 07 TK 1662). * దర్యాప్తు అధికారులు : CI రామానాయక్ గారు, SI శ్రీ డి. అశోక్ గారు. * ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన వారు: శ్రీ పి. మురళీ కృష్ణ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ * న్యాయస్థానం : గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరు * గౌరవ న్యాయమూర్తి : శ్రీమతి వి. దీప్తి. * CMS సీఐ నరసింహారావు గారు * కోర్ట్ పి.సి : PC-4343 ఈ. ప్రకాష్‌బాబు, వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ 👉 రోడ్డు భద్రత నిబంధనలను పాటించకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: లో విచిత్ర వాతావరణం
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ఆదివారం మధ్యాహ్నం విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి...
By Kothuru Murali 2026-05-17 17:34:00 0 89
SURAKSHA
Retired Telangana Cops: Helping Society With New Purpose
niform తీసేసినా Telangana retired police officers బాధ్యత వదలేదు. Traffic awareness programs...
By Kalaga Sailaja 2026-07-03 10:58:50 0 33
SURAKSHA
Kona Sasidhar IAS: Driving Education and Digital Governance
A dynamic Andhra Pradesh cadre IAS officer whose leadership in education, digital governance,...
By Lokeshwari Panthadi 2026-07-16 08:31:24 0 40
Andhra Pradesh
కర్నూలులో దొంగతనాలు !! రెచ్చిపోతున్న దొంగలు
కర్నూలు సిటీ : కర్నూలు నగరంలోని ప్రజా నగర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజూ రాత్రి మూడు...
By Hari Krishna 2025-12-29 13:52:41 0 225
Andhra Pradesh
అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరు రానున్న జగన్ మోహన్ రెడ్డి.
గుంటూరు :ఈ రోజు 03.02.2026 మంగళవారం ఉదయం, మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు వై.యస్.ఆర్.కాంగ్రెస్...
By John Baji 2026-02-03 11:47:32 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com