ఏపీలో పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఇకపై మార్కుల జాబితాల్లో ఆ మార్కులు చేరుస్తారు

0
217

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి మార్కుల జాబితాలో ఒకేషనల్‌ సబ్జెక్టు మార్కులను చేర్చనున్నారు. సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి శ్రీనివాసరావు ఈ విషయాన్ని తెలిపారు. వృత్తి విద్య కోర్సులు ఇకపై విద్యార్థుల మార్కుల గ్రేడింగ్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టడానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. వృత్తి విద్యను కేవలం ఒక అదనపు సబ్జెక్టుగా కాకుండా.. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మార్పు విద్యార్థులకు కొత్త అవకాశాలను అందిస్తుందన్నారు శ్రీనివాసరావు.

విజయవాడలో రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలు అట్టహాసంగా జరిగాయి. 26 జిల్లాల నుంచి 10 రకాల వృత్తులలో 260 ప్రాజెక్టులు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందిన విద్యార్థులు స్వయంగా తయారుచేసిన దుస్తులను ధరించి ర్యాంప్‌పై నడిచి అందరినీ ఆకట్టుకున్నారు. విజేతలకు నగదు బహుమతులు, పతకాలు అందజేశారు. ఈ పోటీల ముగింపు సందర్భంగా, వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందిన విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుకున్నారు. వారు స్వయంగా రూపొందించిన దుస్తులను ధరించి ర్యాంప్‌ వాక్‌ చేశారు. ఇది వారి నైపుణ్యానికి, ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రేడ్‌ల వారీగా బహుమతులు అందించారు. ప్రథమ స్థానం సాధించిన వారికి రూ.25వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.15 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ.10 వేలు చొప్పున నగదు బహుమతులతో పాటు పతకాలు అందజేశారు. ఈ బహుమతులు విద్యార్థులను మరింత ప్రోత్సహించేలా ఉన్నాయి.

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. ఈ మార్పులకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. జనరల్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ కేటగిరీల విద్యార్థులు ఈ మార్పులను తప్పక గమనించాలని సూచించింది. ఈ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల వెయిటేజీ ఉండదు. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులకు 7 పేపర్ల విధానాన్ని అమలు చేయనున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు ఒక్కో పేపర్ ఉంటుంది. ప్రతి పేపర్ 100 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ సైన్స్ సబ్జెక్టులో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు వేర్వేరు రోజుల్లో 50 మార్కుల చొప్పున జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్‌లో కాంపోజిట్ పేపర్–వన్‌ 70 మార్కులకు, పేపర్–టు 30 మార్కులకు ఉంటుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా.. టెక్నాలజీతోనే సేవలు: సీఎం చంద్రబాబు.
ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందాలని, ఇందుకోసం ఏఐ అసిస్టెంట్, బ్లాక్ చెయిన్ వంటి...
By Pagadala Venkateswar 2026-08-25 06:19:46 0 87
Telangana
రెండు బైకలు డికొన్నాయి
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా...
By Gandla Vaijanath 2026-06-04 07:32:05 0 254
Telangana
భట్టి భార్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% లంచం అడిగిందని ఆరోపించిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని
 విక్రమార్క భార్యపై విచారణ జరపాలని గవర్నర్‌కు ఫిర్యాదు ‎భట్టి భార్య రిటైర్మెంట్...
By Ponnala Srinivasrao 2026-08-12 03:20:15 0 183
Andhra Pradesh
పుంగనూరు: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఎఫ్ఓ
పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం పెట్రోల్ బంక్ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్...
By Kothuru Murali 2026-03-17 06:58:53 0 210
Media Academy
🌟 BMA Academy: Building Journalists for Tomorrow
🌟 BMA Academy: Building Journalists for Tomorrow At BMA Academy, we don’t just teach; we...
By Media Academy 2025-04-29 08:41:17 0 4K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com