బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?

0
456

బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?

బాపట్ల: బాపట్ల పట్టణం చీలురోడ్డు సెంటర్ వద్ద, జామ్ జామ్ టీ కొట్టు పక్కనే ఉన్న సైడ్ కాలువ మరోసారి మున్సిపాలిటీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. భద్రతా రాళ్లు, కవర్లు లేకుండా వదిలేసిన కాలువలో  వ్యక్తి పడిపోవడం కలకలం రేపింది.

బస్సు వెళ్లిపోతుందన్న తొందరలో ముందున్న డ్రైనేజ్ మీద కాలు పెట్టి వేగంగా వెళ్లే క్రమంలో సమతుల్యం కోల్పోయిన వ్యక్తి నేరుగా సైడ్ కాలువలోకి పడిపోయాడు. క్షణాల వ్యవధిలో ప్రాణాపాయం సంభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్న కొంతమంది యువకులు అపెద్దాయన్ని బయటికి లాగినారు అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాలు దక్కాయి.

అయితే, కాలువలో పడిన అతని మొబైల్ ఫోన్ పూర్తిగా పాడైపోయింది. ఒకవేళ కొద్దిగా ఆలస్యం జరిగి ఉంటే పరిస్థితి ఎంత ఘోరంగా మారేదో ఊహించడానికే ప్రజలు భయపడుతున్నారు.

రోజురోజుకీ మున్సిపాలిటీ నిర్లక్ష్యం పెరుగుతుండటంతో బాపట్ల పట్టణంలోని సైడ్ కాలువలు ప్రజలకు ఉచ్చు పాశాలుగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. ప్రాణాలు పోయాకే అధికారులు కదలాలా? ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవడం ఎందుకు చేతకావడం లేదు?

తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సైడ్ కాలువలపై భద్రతా రాళ్లు ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి.
మదనపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నెకు చెందిన చంద్రబాబు కుమారుడు రంగు...
By Pagadala Venkateswar 2026-07-01 06:58:19 0 111
SURAKSHA
Nandini Maharaj, IAS: A Rising Leader in Public Service
A dynamic 2019-batch AGMUT cadre IAS officer known for citizen-centric governance, women and...
By Lokeshwari Panthadi 2026-07-18 07:07:17 0 162
Telangana
పెద్దపల్లిలో స్కూల్, కాలేజీ బస్సులో తనిఖీలు
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్కూల్...
By Sunka Santhosh 2026-06-17 10:54:06 0 141
SURAKSHA
Visionary Leader: The Inspiring Story of IPS Navdeep Singh Virk
Shaping Modern Law Enforcement: How IPS Navdeep Singh Virk’s Dynamic Leadership is...
By Kalaga Sailaja 2026-07-20 06:40:55 0 108
Andhra Pradesh
రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు-2026
రెవెన్యూ ఉద్యోగులు క్రీడల పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎపిఆర్ఎస్ఏ అధ్యక్షులు కె. శ్రీరాములు...
By Manda Ramkumar 2026-03-26 10:14:06 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com