వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి

0
240

విజయవాడ

26-12-2025

 

ప్రచురణార్ధం

 

*వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నివాళి*

 

*పలుచోట్ల జరిగిన వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు*

 

*నేటికీ కూడా ప్రజల గుండెల్లో పాతుకుపోయిన వ్యక్తి వంగవీటి మోహన రంగా - వెలంపల్లి శ్రీనివాసరావు*

 

పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా రంగా అభిమానులు పలుచోట్ల ఏర్పాటుచేసిన వర్ధంతి కార్యక్రమాలలో మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని రంగా గారి విగ్రహానికి మరియు చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. 

 

స్థానిక 44వ డివిజన్ చెరువు సెంటర్ లోని వంగవీటి మోహన రంగ విగ్రహం వద్ద వైసిపి నాయకులు గొంది ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వంగవీటి మోహన రంగ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు

 

స్థానిక 47వ డివిజన్ కుండల మార్కెట్ వద్ద వైసిపి నాయకులు కూరాకుల నాగ ఆధ్వర్యంలో నిర్వహించిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వంగవీటి మోహన రంగ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణి చేసారు

 

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పైన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. రంగా గారు మరణించి నేటికి 37 ఏళ్ళు అయినా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని గెలుచుకున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల పేదల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి వంగవీటి మోహన రంగ అన్నారు. ప్రజల సమస్యల కోసం చేస్తున్న పోరాటంలో రంగ గారు హత్యకు గురయ్యారన్నారు.హత్యకు గురై 37 సంవత్సరాలు పూర్తయిన నాటి నుంచి ప్రజల గుండెల్లో చెరగని స్థానం వంగవీటి మోహన రంగ గారిదన్నారు.

 

ఈ కార్యక్రమాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Mizoram
Mizoram Strengthens Cultural Heritage Through Preservation
Description:Mizoram continues to strengthen its cultural heritage through sustained efforts to...
By Fathima Safa 2026-07-01 10:54:58 0 82
Andhra Pradesh
త్రిపురాంతకం మండలం, గొల్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన
త్రిపురాంతకం మండలం, గొల్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఉప్పలపాటి తిరుమలబాబు కుటుంబాన్ని...
By Chennaiah Kati 2026-07-14 19:13:34 0 115
Andhra Pradesh
నిమ్మనపల్లి కేజీబీవీ పాఠశాల‌ను డీఈవో ఆకస్మిక తనిఖీ.
అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం గురువారం నిమ్మనపల్లె కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ...
By Pagadala Venkateswar 2026-02-06 04:28:25 0 171
BMA
MIB 2026 Rules: Major Overhaul of Broadcast Regulation
The Ministry of Information and Broadcasting has just notified the draft Telecommunications...
By JoinBMA 2026-09-09 05:47:13 0 137
SURAKSHA
లు సంస్కరణలు - పునరావాసం
నేరస్థులలో మార్పు తీసుకురావడానికి జైళ్లలో వారికి వివిధ వృత్తి విద్యలలో శిక్షణ ఇస్తున్నారు. వారు...
By Kalaga Sailaja 2026-06-29 08:35:26 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com