డ్రంకెన్ డ్రైవ్ స్వీయపర్యవేక్షణ లో హైదరాబాద్ C.P. సజ్జనర్ IPS.|

0
302

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్‌ వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలను బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

తనిఖీలు జరుగుతున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో మాట్లాడి.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు.

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు.

డిసెంబరు 31 రాత్రి వరకు నగరవ్యాప్తంగా ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

 

మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

తీవ్రతను బట్టి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు.

#sidhumaroju   

Like
1
Search
Categories
Read More
Business & Finance
India Approves ₹23,731 Cr GOBARdhan Biogas Scheme
The Union Cabinet has approved the ₹23,731 crore National Unified GOBARdhan Scheme to accelerate...
By Shiva Reddy Kanuganti 2026-08-07 06:32:04 0 214
SURAKSHA
Surendra Singh Yadav IPS: A Leader Shaping Modern Policing
A 1997-batch AGMUT cadre IPS officer whose commitment to public safety, technology-driven...
By Kalaga Sailaja 2026-07-22 10:55:55 0 155
Andhra Pradesh
పుంగనూరు: నెల్లి చెట్ల ఏరియాలో తిష్ట వేసిన 14 ఏనుగులు
పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలంలో పంటలను ధ్వంసం చేసిన 14 ఏనుగుల గుంపు శనివారం రాత్రి నుంచి...
By Kothuru Murali 2026-04-06 07:08:21 0 209
Andhra Pradesh
నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు • ప్రభుత్వ అతిథి హోదాలో...
By Chennaiah Kati 2026-01-25 07:18:49 0 222
Telangana
Suryapeta news
సూర్యాపేట జిల్లా లోనీ పనిగిరి దగ్గర గోర ఆక్సిడెంట్ నిన్నా సాయంత్రం కారు అతివేగంగా బైక్ ను డికొనడం...
By Mahankali Ravi 2026-05-25 10:41:27 0 298
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com