జారి పడుతున్న బండ రాళ్లు ప్రమాద భరితంగా పానకాల స్వామి ఘాట్ రోడ్డు

0
354

*జారిపడుతోన్న బండరాళ్లు*

 

*-ప్రమాద భరితంగా పానకాల స్వామి ఘాట్ రోడ్డు మార్గం*

 

*పట్టీపట్టనట్లుగా దేవాదాయశాఖ అధికారులు*

 

*రిటైనింగ్ వాల్ నిర్మించాలని భక్తుల వినతి*

 

*మంగళగిరి:*

మంగళగిరి కొండపై వేంచేసియున్న శ్రీ పానకాల లక్ష్మీ నృసింహ స్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు మార్గంలో తరచూ బండరాళ్లు జారిపడుతోన్నాయి. దీంతో ఘాట్ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించే భక్తులు, వాహనదారులు బండరాళ్లు ఎక్కడ తమపై పడిపోతాయోనని భయాందోళనకు గురి అవుతున్నారు. ఘాట్ రోడ్డు నిర్వహణా లోపంతో ప్రమాద భరితంగా తయారవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్డు వెంబడి కొండకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే తమ ప్రాణాలను కాపాడిన వారవుతారని భక్తులు అంటున్నారు.

 

*ఎగువ సన్నిధిలో కార్లు పార్కింగ్ వద్ద అపరిశుభ్రత*

 

*నిలిచిన మురుగునీటి తో దుర్వాసన*

 

కొండపై కార్లు పార్కింగ్ చేసే ప్రాంతంలో మురుగునీరు నిలిచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. నిలిచిన మురుగునీరు పచ్చగా మారడంతో పాటు దోమలు పెరిగి వ్యాప్తి చెందుతోన్నాయి. దీంతో ఎగువ సన్నిధికి వచ్చే భక్తులు కొంత అసహనానికి గురి అవుతోన్నారు. ఎంతో పవిత్రమైన ఆలయం శ్రీ పానకాల లక్ష్మీ నృసింహ స్వామి ఆవరణలో ఇలాంటి అపరిశుభ్రమైన దృశ్యాలు కనిపించడం బాధాకరమని, అధికారులు స్పందించి శుభ్రతా చర్యలు చేపట్టాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

 

*కంపు కొడుతోన్న మరుగుదొడ్లు...ఆపై అక్రమంగా రుసుం వసూళ్లు*

 

మంగళగిరి కొండపై కొలువైన శ్రీ పానకాల లక్ష్మీ నృసింహ స్వామి ఆలయానికి సంబంధించిన మరుగుదొడ్లు అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు మరుగుదొడ్లు వినియోగించుకోవాలంటే రుసుం చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. మల,మూత్ర విసర్జన చేసే భక్తుల వద్ద నుంచి రూ.5 నుంచి రూ. 10 వరకూ అక్రమంగా వసూలు చేస్తోన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వెటకారపు మాటలతో చీదరించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఎగువ సన్నిధిలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

 

Search
Categories
Read More
Telangana
ములుగు. హనుమకొండ జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి రాక...
నేడు ములుగు, హనుమకొండ జిల్లాలకు సీఎం భారత్ అవాజ్ న్యూస్:16 ఆగస్టు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం...
By Gujile Ramu 2026-08-16 04:17:04 0 148
Telangana
చదువు ఇష్టం లేక, కుటుంబ కలహాలతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!
మహబూబాబాద్::: కొత్తగూడ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన పెండ్లి...
By Bheeshman King 2026-07-02 16:00:11 0 463
Telangana
కాంగ్రెస్ నాయకుడు ఆరోగ్య పరిస్థితిపై రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకుర్
గోదావరిఖని యువజన కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు శ్రీనివాస్ గుండెపోటుతో గురికావడంతో హుటాహుటిన...
By Thalakokkula Sadanandam 2026-04-12 02:03:57 0 607
Bharat Aawaz
1975 Emergency to Today: Are We Truly Free?
"𝐖𝐡𝐞𝐧 𝐭𝐫𝐮𝐭𝐡 𝐢𝐬 𝐬𝐢𝐥𝐞𝐧𝐜𝐞𝐝, 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲 𝐰𝐡𝐢𝐬𝐩𝐞𝐫𝐬 𝐢𝐧 𝐟𝐞𝐚𝐫." 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓, 𝟏𝟗𝟕𝟓 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐫𝐤𝐞𝐬𝐭 𝐧𝐢𝐠𝐡𝐭𝐬 𝐢𝐧...
By Bharat Aawaz 2025-06-25 07:37:02 0 2K
Andhra Pradesh
రామాపురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం రామాపురం మండలంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-03-16 13:04:57 0 267
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com