గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటరమణ కాలనీ నాలుగవ లైను ప్రాంతంలో ఆర్గనైజ్డ్ వ్యభిచారం చేస్తున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు

0
352

 *గుంటూరు జిల్లా పోలీస్...* *టాస్క్ ఫోర్స్ రైడ్* _*//నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్గనైజ్డ్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ బృందం,.//*_ 🚩 ఈ రోజు (23.12.2025) మధ్యాహ్నం సుమారు 01:20 గంటల సమయంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటరమణ కాలనీ 4వ లైన్ ప్రాంతంలో ఆర్గనైజ్డ్ వ్యభిచారం జరుగుతున్నట్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి రాబడిన విశ్వసనీయ సమాచారాన్ని SB CI–1 గారికి తెలియజేసి, నగరంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ సత్యనారాయణ గారి దిశానిర్దేశంలో రైడ్ చేసి, వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఒక ఆర్గనైజర్‌తో పాటు ఒక మహిళ మరియు ఒక పురుషుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి మూడు (03) సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 📌 నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, వెస్ట్ డీఎస్పీ శ్రీ అరవింద్ గారి పర్యవేక్షణలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీఐ శ్రీ సత్యనారాయణ గారు తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో తాడుతో ఆటోను లాగిన సీపీఐ నాయకులు
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా మంగళవారం సిపిఐ నాయకులు ఆటో...
By Kothuru Murali 2026-06-09 13:35:56 0 77
Telangana
బాలానగర్ ఇండస్ట్రియల్ PE Engineering Employes Union AIFTU సమ్మేను విజయవంతం చేశారు..
29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని రద్దు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను...
By Yadamma Raju Gajapaga 2026-02-12 06:30:40 0 419
Telangana
#కరీంనగర్ డిమార్ట్ ఏరియా మురుగు కాలువలు శుభ్రపరచడం.
కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ ఆరేపల్లి రోడ్డు డిమార్ట్ పరిసర ప్రాంతాలలో మురుగునీటి కాలువలను...
By Thalakokkula Sadanandam 2026-03-20 03:21:39 0 562
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు.
ప్రాంతాల వారీగా రోగులను గుర్తించి స్థానికంగా చికిత్స అందించడమే లక్ష్యం 2030 నాటికి క్యాన్సర్...
By Pagadala Venkateswar 2026-01-30 05:59:00 0 148
Andhra Pradesh
రాయచోటిలో పుంగనూరు యువకుడి మృతి
మంగళవారం రాయచోటి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై...
By Kothuru Murali 2026-06-24 16:48:31 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com