తెలంగాణలో ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు...

0
666

ప్రభుత్వం (Telangana Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచ్ (Upa-Sarpanch)లకు చెక్ పవర్ రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. అన్ని గ్రామ పంచాయతీలో అధికారులు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, ఉపసర్పంచులతో ప్రమాణస్వీకారాలు చేయించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన బాధ్యతలను అప్పచెప్పారు. గ్రామాల్లో ఇప్పటి వరకు కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలన సర్పంచులు, వార్డు సభ్యుల రాకతో ముగిసిపోయింది.కాగా, 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో ఉప సర్పంచికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వడంతో ఇన్నాళ్లు ఆ పదవి కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. చాలా గ్రామాల్లో సర్పంచ్ ఒక పార్టీ అయితే.. ఉప సర్పంచ్ ఇంకో పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య విభేదాలు ఏర్పడితే.. అభివృద్ధికి ఆకంటం కలుగుతుందనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
తాడేపల్లి తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వినూత్నంగా కృష్ణా నదిలో
*తాడేపల్లి*   *కృష్ణా నదిలో వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.....*  ...
By Rajini Kumari 2026-03-30 04:46:49 0 190
Goa
Goa Strengthens Coastal Surveillance During Monsoon
Goa authorities have intensified coastal surveillance following dangerous sea conditions caused...
By Navya Sree 2026-06-25 08:18:34 0 53
Andhra Pradesh
బహుద కాలువలోకి కారు దూసుకెళ్లి ఆరుగురికి గాయాలు.
అన్నమయ్య జిల్లాలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు...
By Pagadala Venkateswar 2026-06-19 04:40:39 0 74
Tamilnadu
కొడైకెనాల్‌లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్‌హౌజ్‌లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!
కొడైకెనాల్‌‌లో ఓ గెస్ట్ హౌజ్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు...
By Bharat Aawaz 2026-02-23 07:48:34 0 437
Andhra Pradesh
మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు: కమిషనర్
కర్నూలు :  మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-08 11:33:14 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com