పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో విషాద ఘటన

0
218

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన...

 

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి NH–565 పై తెల్లవారుజామున విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

 

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక పెద్దపులి మృతి చెందింది.

 

సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

 

ఈ సందర్భంగా విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుజాత మాట్లాడుతూ

 

విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మొత్తం నాలుగు పెద్దపులులు ఉన్నాయని,

అందులో ఒక పులి తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడిందని తెలిపారు.

 

పులి మృతితో అటవీశాఖలో కలకలం రేగింది. ఘటనపై కేసు నమోదు చేసి, పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించే పనిలో అటవీశాఖ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.

 

అటవీ జంతువుల సంరక్షణ కోసం జాతీయ రహదారులపై వేగ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Telangana
ఓటును రక్షించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత
హుజూర్‌నగర్  / భారత్ అవాజ్ : దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన SIR (Special...
By Malla Rambabu 2026-07-18 07:53:28 1 528
SURAKSHA
H. Lalengmawia: Driving Mizoram's Progress with Vision
A dedicated 2005-batch AGMUT Cadre IAS officer, H. Lalengmawia serves as Commissioner &...
By Lokeshwari Panthadi 2026-07-23 11:14:39 0 165
Andhra Pradesh
గుంటూరు నగర పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.
🚩 గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ...
By John Baji 2026-01-22 01:35:32 0 255
SURAKSHA
Karnataka Police: Blood Donors Saving Lives Today
Today Karnataka police officers led “Raktha Dana Jeevana Dana” blood donation camps...
By Kalaga Sailaja 2026-07-04 06:29:46 0 151
BMA
Bharat Media Association
The Bharat Media Association isn't just an organization; it's the collective heartbeat of India's...
By Bharat Aawaz 2025-06-06 07:01:18 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com