అసౌకర్యంగా మేకల సంత - ఇబ్బందులు పడుతున్న రైతులు

0
2K

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామం "శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ రాణి " సత్రంలో నిత్యం మంగళవారం జరిగే మేకల, గొర్రెలు సంతకు ఒక "చరిత్రే"ఉంది.. అలాంటి చరిత్ర ఉన్న మేకల సంతలో అసౌకర్యాలు తిష్ట వేసి రైతులకు మేకలు గొర్రెలకు కనీస సౌకర్యం కల్పించడంలో సత్రం అధికారులు, పంచాయతీ అధికారులు దృష్టి పెట్టకపోవడంపై విఫలం అయ్యారని రైతులు వాపోతున్నారు...

 

సత్రంకు సంబంధించిన స్థలంలో మేకల సంత జరుగుతూ ఉంటుంది... సత్రం స్థలం పంచాయతీ వారు దశబ్దాలు కాలం నుండి సంవత్సరం సంవత్సరం కొద్ది మొత్తంలో లీజుకు తీసుకుని పంచాయతీ వారు ప్రజలకు తెలియజేసేందుకు డప్పు వేయించి, సంవత్సర కాలానికి ఉన్నత అధికారులు సమక్షంలో పాట నిర్వహించడం జరుగుతుంది... గతంలో జరిగిన పాట పదిలక్షలు (10,00000) పైగా వేలం పాట జరిగింది... పాట నిమ్మితం డబ్బులు పాటదారు నుండి డబ్బులు వసూలు చేసుకుని చేతులు దులుపు కోవడం తప్పితే పంచాయతీ వారు సంతలో ఎటు వంటి సౌకర్యలు కల్పించడం లేదని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు... ఎండలోనూ, వర్షంలోనూ కూడా రైతులు ఇబ్బందులు గురువుతున్నారు... కత్తిపూడి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విశాఖ జిల్లా, రాష్ట్ర నలుమూల నుండి రైతులు, కొనుగోలు దారులు ఈ సంతకు రావడం జరుగుతుంది... సంతలో సుమారు లక్షలాది రూపాయలు లావాదేవీలు జరుగుతాయి... మేకకు 10 వసూలు చేసందుకు పాటలో రేటు నిర్ణయిస్తే పాటదారులు రైతులు వద్ద ఒక్కొక మేక, గొర్రెలు వద్ద 20 రూపాయలు నుండి 30 రూపాయలు బలవంతపు వసూలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఈ సంతలో సుమారు 2000 నుండి 5 వేలు వరుకు మేకలు, గొర్రెలు క్రయ విక్రయాలు జరుగుతాయి... గ్రామంలో అనేక మంది ఉపాధి పొందతున్నారు.. ఇంత దశబ్దాలు చరిత్ర ఉన్న సంతలో షెడ్డులు నిర్మించి, మంచినీటి సదుపాయాలు కల్పించమని ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను అధికారులను రైతులు కోరుతున్నారు... #BABJI DADALA

Search
Categories
Read More
Andhra Pradesh
AP సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*అమరావతి*   *ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని...
By Rajini Kumari 2025-12-23 09:39:15 0 455
Andhra Pradesh
పశ్చిమ వాడవాడల్లో జగనన్న జన్మదిన వేడుకలు
విజయవాడ 21-12-2025   ప్రచురణార్ధం   *పశ్చిమలో వాడ వాడ ల జగనన్న జన్మదిన వేడుకలు*...
By Rajini Kumari 2025-12-21 12:20:53 0 262
Telangana
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
    ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.    శాసనసభ, శాసన మండలిలో...
By Ellandula Sandeep 2025-12-29 04:32:03 0 654
Telangana
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన DTDO శ్రీ జాదవ్ అంబాజీకి ఘన సన్మానం
ఆసిఫాబాద్, జులై 22 భారత్ ఆవాజ్ ప్రతినిధి: జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నూతన గిరిజన అభివృద్ధి అధికారి...
By Chunarkar Jagadeesh 2026-07-22 12:19:02 0 246
Andhra Pradesh
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్  బాపట్ల:  ఐవిఎస్ సర్వేలో...
By Gadiyapudi Narendra 2026-01-09 15:33:59 0 279
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com