CM చంద్రబాబుకుCPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతి పత్రం

0
247

*Press Release*

 

*నరేగా పథకంలో కేంద్రం వాటా తగ్గింపు సమంజసం కాదు*

 

*సీఎం చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతిపత్రం*  

 

*అమరావతి, డిసెంబర్ 22 :* జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం సమంజసం కాదని, దీనిపై కేంద్రంతో మాట్లాడి మహాత్మాగాంధీ పేరును కొనసాగించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు రామకృష్ణ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎమ్‌జీఎన్‌ఆర్ఈజీఎస్ పథకానికి ఇచ్చే 90 శాతం నిధులను 60 శాతానికి కేంద్రం కుదించిందని, 40 శాతం నిధులను రాష్ట్రం భరించాలంటే ఏపీ సహా పలు రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని సీఎంతో అన్నారు. అదే విధంగా 100 నుంచి 125 రోజులకు పనిదినాలు పెంచుతామని కేంద్రం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు కుటుంబానికి సగటున 50 పని దినాలు కూడా కల్పించలేదని తెలిపారు. ఇప్పటి వరకూ హక్కుగా ఉన్న ఈ చట్టంలో సవరణల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కష్టంగా మారుతుందని, వెంటనే సవరణలను వెనక్కి తీసుకునేలా కేంద్రంతో మాట్లాడాలని కోరారు. 

****

Search
Categories
Read More
Bihar
Global Flight Path: Direct Gaya-to-Bangkok Routes Approved
To boost international tourism, the Bihar Cabinet, chaired by Chief Minister Samrat Choudhary,...
By Dunna Jessicaruth 2026-05-21 05:32:53 0 252
Andhra Pradesh
మదనపల్లి: రెవెన్యూ శాఖ పరిపాలనకు వెన్నెముక: జేసీ.
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన రెవెన్యూ డే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ...
By Pagadala Venkateswar 2026-06-21 07:29:41 0 103
Andhra Pradesh
అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి సత్యకుమార్.
    అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి...
By Pagadala Venkateswar 2026-06-13 11:10:45 0 122
Telangana
సారంగాపూర్ చక్కర ఫ్యాక్టరీ. (NCFS)తిరిగి ప్రభుత్వం ఓపెన్ చెయ్యాలి...
నిజామాబాద్ కో-ఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీ (NCSF) ప్రస్తుతం పూర్తిగా మూతపడి ఉంది. గత 16 ఏళ్లుగా ఈ...
By Chakrala Sadhanand 2026-08-06 23:32:08 0 426
Andhra Pradesh
ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కు చెదరని స్థానం
*ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కుచెదరని స్థానం*   *జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు...
By Rajini Kumari 2025-12-26 09:41:50 0 266
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com