ఆధ్యాత్మిక జెన్Z వాగ్లర్ స్వాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు

0
217

దేశవ్యాప్తంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ Z వాగ్లర్ స్వాతి రోజాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు అభినందించారు. ఆమె చేస్తున్న సాహస యాత్ర గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కొద్ది వారాల క్రితం ఆమె శ్రీశైలంలో పర్యటించినప్పుడు వసతి, భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమెకు శ్రీశైలంతోపాటు, తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దుర్గమ్మ దర్శనం అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి.. ఆయన చూపిన శ్రద్దకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీశైలంలో గతంలో ఎదురైన అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బైక్ రైడింగ్, బైకులపై తనకున్న ఆసక్తిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచుకున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
TN Police Today: Fighting Social Evils With Courage
Today TN police officers fought against social evils across state. Village meetings held against...
By Kalaga Sailaja 2026-07-04 08:09:57 0 75
Telangana
పత్తి కొనుగోళ్లలో కేంద్ర బీజేపీ - రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ల నిర్లక్ష్య వైఖరి,
  పత్తి రైతుకు కన్నీరే మిగిల్చింది.   రైతులు నేరుగా మార్కెట్ కు తెచ్చే పత్తికి అనేక...
By Prashanth Goindla 2025-12-22 07:43:53 0 390
Telangana
హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో దారుణం.|
హైదరాబాద్ – పేట్ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ...
By Sidhu Maroju 2025-12-23 11:59:58 0 303
Andhra Pradesh
వీరభద్ర స్వామి శాకాంబరి ఉత్సవం ఆహ్వాన పత్రిక అందజేత
    *ఈనెల 29న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవస్థానంలో  దేవి...
By Benguluri Madhubabu 2026-07-29 07:05:37 0 242
Andhra Pradesh
క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల
క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల...
By Chennaiah Kati 2026-07-23 10:31:55 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com