గుంటూరు జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్ నాకాబందీ కార్యక్రమం

0
243

గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ : 22.12.2025* _*//గుంటూరు జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించిన పోలీస్ అధికారులు. – గంజాయి, మత్తు పదార్థాల రవాణా మరియు ఇతర నేరాల అరికట్టడమే లక్ష్యం,.//*_ 📍గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి(21.12.2025) విస్తృతంగా "నాకాబందీ" నిర్వహించారు.దీనిలో బాగంగా 603 కేసులు నమోదు చేసి, రూ.4,27,832/- జరిమానా విధించారు.అదే విధంగా 31 అనుమానిత వాహనాలను సీజ్ చేశారు. 🔰 ఈ నాకాబందీ కార్యక్రమంలో భాగంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేయడంతో పాటు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, అక్రమ ఆయుధాల తరలింపు వంటి ఇతర నేరాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 🔰 నాకాబందీ సమయంలో అనుమానిత వ్యక్తులు మరియు అనుమానాస్పద వాహనాలను ఆపి సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ వంటి ధ్రువ పత్రాలను పరిశీలించారు. అదేవిధంగా వాహనదారులు ప్రయాణిస్తున్న మార్గం, ప్రయాణ ఉద్దేశ్యం, గమ్యస్థానం గురించి ఆరా తీసి అవసరమైన చోట్ల హెచ్చరికలు జారీ చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. 🔰గుంటూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి సంబంధించి ఈ నాకాబంధి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియను రాబోయే రోజుల్లో కూడా నిర్వహించి, ఇలాంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని గుంటూరు జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు. 🔰 ఈ నాకాబంధి కార్యక్రమంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని వారు, వాహన ధ్రువ పత్రాలు లేని వారిపై పోలీస్ అధికారులు 603 కేసులు నమోదు చేసి, రూ.4,27,832/- జరిమానా విధించారు.అదే విధంగా 31 అనుమానిత వాహనాలను సీజ్ చేశారు. పెదనందిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 131 క్వార్టర్ బాటిళ్ల మద్యం సీసాలను సీజ్ చేసి, వాటిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని,పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు.
          Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి:...
By Pagadala Venkateswar 2026-02-02 05:03:38 0 150
Andhra Pradesh
Chandrababu: దివ్యాంగులకు చంద్రబాబు ఉగాది కానుక.. రేపే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.
రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో...
By Pagadala Venkateswar 2026-03-17 08:11:57 0 171
Rajasthan
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
By Dunna Jessicaruth 2026-05-15 06:11:13 0 89
Andhra Pradesh
పుంగనూరు: రావణ వాహనంపై దర్శనం ఇచ్చిన నృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
By Kothuru Murali 2026-04-26 10:42:07 0 92
Andhra Pradesh
సోమవారం సాయంత్రం అక్కయపాలెం గ్రామ పరిధిలో హైవే 216 పై రోడ్డు ప్రమాదం
చీరాల: సోమవారం సాయంత్రం అక్కయపాలెం గ్రామ పరిధిలో హైవే 216 పై రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో...
By Gadiyapudi Narendra 2026-01-26 16:57:27 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com