పల్స్ పోలియో రెండు చుక్కలు జీవితాంతం రక్షణ అయ్యన్నపాత్రుడు

0
272

 *రెండు చుక్కలు - జీవితాంతం రక్షణ: గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు* 

 

నర్సీపట్నం:

భవిష్యత్ తరాల ఆరోగ్య రక్ష కోసం ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని తల్లిదండ్రులందరూ వినియోగించుకోవాలని ఏపీ అసెంబ్లీ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు పిలుపునిచ్చారు. ఆదివారం నర్సీపట్నం ఎన్టీఆర్ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్పీకర్ గారు ప్రారంభించగా, వారి సతీమణి, కౌన్సిలర్ పద్మావతి గారు చిన్నారులకు స్వయంగా చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ:

నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 28,467 మంది (5 ఏళ్ల లోపు) చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యమని తెలిపారు.

పోలియో చుక్కలు వందశాతం సురక్షితమని, ఎటువంటి అపోహలు లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు వేయించాలని సూచించారు.

పనులు ఉన్నా అశ్రద్ధ చేయకుండా, "రెండు చుక్కలు - జీవితాంతం రక్షణ" అని గుర్తించి, దగ్గర్లోని కేంద్రాలకు వెళ్లి పిల్లలకు చుక్కలు వేయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ సూర్యచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Haryana
Haryana Promotes Tourism and Heritage Conservation
Haryana is enhancing its tourism sector by preserving its rich cultural heritage while improving...
By Fathima Safa 2026-06-30 12:36:00 0 145
Andhra Pradesh
ప్రజా సమస్యలు తీర్చండి, ఏఐ వాడండి.. పనిచేసే వారికే ప్రోత్సాహం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు.
ప్రభుత్వ పాలనలో ప్రజా సంతృప్తే పరమావధిగా పనిచేయాలని, దీనికోసం ఆధునిక టెక్నాలజీని పూర్తిస్థాయిలో...
By Pagadala Venkateswar 2026-09-11 09:05:35 0 73
Andhra Pradesh
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని కృష్ణ చైతన్య హాస్పిటల్ పై దుండగులుదాడి
గుంటూరు...   గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని కృష్ణచైతన్య అసుపత్రి పై అర్ధరాత్రి దుండగులు...
By Rajini Kumari 2026-04-20 14:37:55 0 162
Andhra Pradesh
అంబటి రాంబాబు గారి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్.
నేడు గుంటూరులోని అంబటి రాంబాబు స్వగృహం నందు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి,...
By John Baji 2026-02-11 10:03:35 0 593
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com