నెల్లూరు రూరల్ వైసీపీకి రాజీనామాల పరంపర

0
319

*నెల్లూరు రూరల్ వైసీపీ కి రాజీనామాల పరంపర* 

*ఆమంచర్ల పంచాయతీలో అప్పయకండ్రిగ వైసీపీ ముఖ్యనేత గుడి మస్తానయ్య, ఆమంచర్ల మాజీ ఎంపీటీసీ యల్లంపల్లి రత్నమ్మ వైసీపీ కి రాజీనామా.* 

*అనేక మంది ఆమంచర్ల పంచాయతీకి చెందిన అప్పయకండ్రిగ, స్వర్ణ జ్యోతి నగర్, సేవజ్యోతి కాలనీ, మట్టెంపాడు, మన్నవరపాడు వైసీపీ నాయకులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.*  

--------------------------------

 

🔸 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్యనేత గుడి మస్తానయ్య, ఆమంచర్ల మాజీ యంపిటీసీ యల్లంపల్లి రత్నమ్మ మరియు వారి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి, సాదరంగా ఆహ్వానించారు.

 

🔸 అందరం కలసికట్టుగా ఒక్కతాటిపై ఉండి, ప్రజలకు అందుబాటులో ఉందాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

 

🔸 నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతిఒక్కరికి అండగా ఉంటా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

 

🔸 భవిష్యత్తులో చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

 

పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, గెనేడి వెంకటేశ్వర్లు నాయుడు, మల్లినేని వేణు నాయుడు, జెడ్.పి. కో ఆప్షన్ మెంబెర్ అల్లాబక్షు, వాకా వెంకటేశ్వర్లు, నీటిసంసంఘం అధ్యక్షులు వేమినేని మురళీధర్, డేగా గంగాధర్, మల్లినేని వెంకట రమణమ్మ, గుడి రఘురామయ్య, బాబు, శీనయ్య, ప్రవీణ్, అచ్చి పుట్టయ్య, ప్రసాద్, పూనూరు పవన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సదుం పోలీస్ స్టేషన్ పరిశీలించిన డిఐజి కోయ ప్రవీణ్ణ్
ఆదివారం, పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుం పోలీస్ స్టేషన్‌ను కర్నూల్ డిఐజి కోయ ప్రవీణ్...
By Kothuru Murali 2026-01-04 10:51:27 0 234
Andhra Pradesh
పుంగనూరు: చోరీకి వచ్చాడని అనుమానంతో వ్యక్తికి దేహశుద్ధి
పుంగనూరు మండలం, దిగువపల్లి గ్రామంలో బోరు బావుల వద్ద కేబుల్ వైర్లు దొంగిలించే ప్రయత్నం...
By Kothuru Murali 2026-05-31 16:25:00 0 147
Andhra Pradesh
మైనార్టీ ఆస్తులపై కన్నేసిన కూటమి ప్రభుత్వం నేతలు.
అంజుమన్ కి సబదించినినా ఈ భూమి ఎన్నో దశాబ్దాలుగా మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలకు, విద్యా-సామాజిక...
By John Baji 2025-12-23 11:24:50 0 277
Telangana
నిజామాబాద్
చిన్నాపూర్ నర్సరీ నుండి నందిపేట్ గ్రామానికి 3,000 మొక్కలు కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్...
By Sadaq Sadaq 2026-06-18 12:37:51 0 177
Andhra Pradesh
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండగ 2.0 కు శ్రీకారం
*పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండుగ-2.0కు శ్రీకారం*   *గ్రామ సీమల అభ్యున్నతికి పవన్ కళ్యాణ్...
By Rajini Kumari 2026-01-02 12:31:21 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com