పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న గద్దె రామ్మోహన్

0
272

ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం

-ఏపీఐఐసీ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ 

 

ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పారు.

 

ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ను చూడాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. అందరికీ ఆరోగ్యం అందించాలని ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం పల్స్ పోలియో వంటి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 2015 వ సంవత్సరం తర్వాత మన దేశంలో పోలియో కేసులు నమోదు కానప్పటికీ పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాల్లో పోలియో కేసులు నమోదు అవుతున్నాయని అందువల్ల ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరారు. మన పిల్లలే మన ఆస్తి అని వారిని ఆరోగ్యవంతులుగా చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పారు. పల్స్ పోలియోతో పాటు టీకాలు కూడా పిల్లలకు క్రమం తప్పకుండా అందించాలని కోరారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ను చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యం నెరవేరాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.

 

కార్యక్రమంలో కార్పోరేటర్

పొట్లూరు సాయిబాబా,పాతూరి సాంబశివరావు,నాదర్ల రాజేష్,కరీమ్, శాయినా బుజ్జి, రెడ్డి రాంబాబు,పోతురాజు, అయ్యప్ప రెడ్డి, కలామ్, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు రవిచంద్ర గారికి సత్కారం
*నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారిని వారి నివాసంలో...
By Rajini Kumari 2025-12-24 10:50:42 0 241
Andhra Pradesh
రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్.
AP: రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు...
By Pagadala Venkateswar 2026-01-24 14:51:59 0 226
Telangana
హన్మకొండ లో ఇందన్న సెగ... బంకుల వద్ద బారులు
 భరత్ ఆవాజ్ ప్రతినిధి:  అంతర్జాతీయ  పరిమాణలా నేపథ్యంలో హన్మకొండ లో ఇందన కొరత...
By Prashanth Goindla 2026-04-27 14:18:59 0 403
Andhra Pradesh
పరీక్ష సామాగ్రి పంపిణీ: విద్యార్థినులకు రేషన్ డీలర్ల చేయూత.
మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులకు అన్నమయ్య జిల్లా రేషన్...
By Pagadala Venkateswar 2026-02-24 07:14:55 0 178
Andhra Pradesh
అక్రమ కేసుల వ్యవహారంలో ఘర్షణ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జే టౌన్ సమీపంలో బుధవారం కొత్తకోట గ్రామానికి వెళ్తున్న మాజీ...
By Kothuru Murali 2026-06-11 12:46:53 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com