కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ

0
224

*ఢిల్లీ*

 

*కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ*

 

• పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ కు చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం

• రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరిన ముఖ్యమంత్రి

• కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని సీఎం విజ్ఞప్తి

 

*పూర్వోదయతో గ్రోత్ ఇంజన్ గా ఏపీ*

• దేశంలోని తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే పూర్వోదయ పథకం వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకునేందుకు, జాతీయ ఆర్ధిక వ్యవస్థకు చోదకశక్తిగా నిలుస్తుందని పేర్కొన్న సిఎం చంద్రబాబు

• గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ, సాగునీటి పారుదల వ్యవస్థల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల నిర్మాణం, విద్య వైద్య రంగాల సదుపాయాల కల్పన కోసం పూర్వోదయ పథకం కీలకంగా మారుతుందని పేర్కొన్న సీఎం 

• తద్వారా ఆయా గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన ఆర్దిక అవకాశాలను అందిస్తుందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి

• విద్య, నైపుణ్యాకల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల లాంటి కీలకమైన రంగాల్లో పూర్వోదయ నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరిన సీఎం

• ఈ పథకం కింద ప్రాధాన్యతా క్రమంలో చేపట్టే ప్రాజెక్టులకు పాలనాపరమైన నిబంధనల్ని సరళీకృతం చేయాలని ..రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటిని వినియోగించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

 

*సాస్కీతో ఏపీకి చేయూత*

• సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన సీఎం

• విశాఖలో యూనిటీమాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్ లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులివ్వాలని కోరిన సీఎం

• సాస్కీకింద రెండో విడత నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు 

• తీవ్ర ఆర్ధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి సాస్కీ పథకం కింద నిధులు కీలమని పేర్కొన్న సీఎం

• వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టలు, రాష్ట్ర, జిల్లా రహదారుల నిర్మాణం, ఎంఎస్ఎంఈ పార్కులు, హౌసింగ్, వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరిన సీఎం

• 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఈ పనులకు గానూ రూ.10,054 కోట్లు సాస్కీ కింద మంజూరు చేయాలని కోరిన ముఖ్యమంత్రి 

 

*రాయలసీమ హార్టికల్చర్ హబ్*

• రాయలసీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీకి ఆర్ధిక సాయం కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని కేంద్రమంత్రికి అందచేసిన ముఖ్యమంత్రి

• ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న 18 పంటలను సాగు చేస్తోన్నట్టు విజ్ఞాపన పత్రంలో పేర్కొన్న సీఎం

• ఈ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాల్లో విస్తరించిన 93 ఉద్యానవన క్లస్టర్లు ప్రత్యక్షంగా పరోక్షంగా 33.7 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తాయని స్పష్టం 

• ఎగుమతులు చేసేందుకు వీలుగా ఉద్యాన ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పండుతున్నాయని తెలిపిన ముఖ్యమంత్రి

• ప్రస్తుతం ఉన్న 8.48 లక్షల హెక్టార్ల హార్టికల్చర్ సాగును 2029 నాటికి 12.28 లక్షల హెక్టార్లకు విస్తరించాలని నిర్ణయించినట్టు పేర్కొన్న సీఎం.

• ఈ ప్రాంతంలో నీటి వనరులను మెరుగుపర్చటంతో పాటు ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతికి వీలుగా రోడ్డు, రైలు, ఓడరేవులు, ఎయిర్ కార్గో సహా లాజిస్టిక్స్ పార్కుల లాంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని స్పష్టం 

• రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు వచ్చే మూడేళ్లలో రూ.41 వేల కోట్ల ఆర్ధిక సహకారం అవసరమని పేర్కొన్న ముఖ్యమంత్రి

• వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047 విజన్ లకు అనుగుణంగా రైతుల వార్షికాదాయం రూ.2 లక్షల నుంచి 3.5 లక్షలకు పెరుగుతుందని స్పష్టం 

• ఈ సానుకూల అంశాలను దృష్టిలో ఉంచుకుని 2026-27 కేంద్ర బడ్జెట్ లో రాయలసీమ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీని ప్రకటించాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరిన సీఎం చంద్రబాబు

 

*పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు*

• ఏపీలో సాగునీటి ప్రాజక్టులకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి

• రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించుకునేలా పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని కోరిన సీఎం

• ఈ మేరకు కేంద్రమంత్రికి విజ్ఞాపన పత్రం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

• గోదావరి నదికి వచ్చే వరద జలాల్లో 200 టీఎంసీల నీటిని పోలవరం ఆనకట్ట నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించటమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్న ముఖ్యమంత్రి

• ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో కరవు నివారణ సాధ్యపడుతుందని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు 

• మూడు దశలుగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అయ్యే వ్యయాన్ని వివరిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రికి లేఖ అందించిన ముఖ్యమంత్రి

• ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఇప్పటికే జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన ముఖ్యమంత్రి

• దీనికి సబంధించి ప్రాథమిక ప్రాజెక్టు రిపోర్టును కూడా కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించినట్టు తెలిపిన సీఎం

• దీనికి ఆమోదం తెలిపిన వెంటనే డీపీఆర్‌ను సమర్పిస్తామని వెల్లడించిన సీఎం.

• ఆమరావతి రాజధాని నిర్మాణానికి రుణ సహకారం అందించిన తరహాలోనే ఈ ప్రాజెక్టుకు కూడా కేంద్రం చేయూత అందించాలని కోరిన ముఖ్యమంత్రి

• ఈ ప్రాజెక్టు ద్వారా కరవు పీడిత ప్రాంతాలైన ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందుతుందని పేర్కొన్న సీఎం

• 2026-27 కేంద్ర బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతూ కేంద్ర ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Search
Categories
Read More
Assam
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket Operation Ghost SIM:...
By BMA ADMIN 2025-05-19 17:40:18 0 2K
Andhra Pradesh
బొబ్బిలిలో ఘనంగా శ్రీ జగన్నాథోత్సవాలు ప్రారంభం
బొబ్బిలి కంచరవీధిలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథోత్సవాలు గురువారం ఘనంగా...
By Boiena Rajesh 2026-07-16 08:16:17 0 55
Andhra Pradesh
'పోర్ట్‌కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలి'
పోర్ట్కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా వైసీపీ నాయకులు పీరుపల్లి రాజశేఖర్ అన్నారు....
By Manda Ramkumar 2026-03-28 06:28:37 0 469
Telangana
అంబేద్కర్ జయంతి సందర్భంగా... మధు ప్రియ పాట
ప్రముఖ గాయని మధు ప్రియ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14, 2026) సందర్భంగా మానుకోట ప్రసాద్ సాహిత్యంలో ఒక...
By Ponnala Srinivasrao 2026-04-14 02:03:24 0 164
Telangana
యూసుఫ్ నగర్ స్మశానవాటిక అభివృద్ధి, ఉర్దూ మెడికల్ స్కూల్ ఏర్పాటుపై మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాధవరం
హైదరాబాద్, జూన్ 19: భారత్ ఆవాజ్ ప్రతినిధి,  అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్ ముస్లిం...
By Jagadeesh Babu 2026-06-19 15:14:34 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com