కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్

0
274

For scrolls

 

అమరావతి

 

*కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్*

 

• గత నాలుగు కలెక్టర్ల సదస్సుల్లో జీఎస్డీపీ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం.

• గత పాలకుడు ఒకే ఒక కలెక్టర్ల సదస్సు నిర్వహించి తర్వాత ఆ కట్టడాన్ని కూల్చేశారు. అలాగే రాష్ట్రాన్ని కూడా ధ్వంసం చేశారు.

• ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సి ఉంది. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ఏపీకి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. 

• రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యం దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.

• పేదరిక నిర్మూలనలో భాగంగా పీ4 లాంటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్తున్నాం.

• ఒకటే జెండా, అజెండా ప్రతీ ఇంటికీ సంపద, అభివృద్ధి చేరాలన్నదే లక్ష్యం.

• ప్రజలంతా ప్రభుత్వం అంటే కలెక్టర్లే అనుకుంటారు. అందుకే అత్యంత జాగ్రత్తగా పాలన అందించాలి.

• కొందరు నేతలు దొంగతనాల్ని కూడా సమర్థిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యల్ని ఖండించాల్సిన అవసరం ఉంది.

• ఇలాంటి విషయాల్లో అందరూ సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది.

• ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి.

• సోమవారం ఒక్కరోజే కాదు ప్రతీ రోజూ ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలి

• పారదర్శకంగా ప్రజలకు పాలన అందించాలని కలెక్టర్లు అందరినీ కోరుతున్నాను

• పరిశ్రమలకు ఇస్తున్న భూములను, ప్రజల నుంచి సేకరిస్తున్న భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా చూడాలి.

• ఇటీవల రెవెన్యూ సంస్కరణల్ని కూడా చేపట్టాం. క్షేత్రస్థాయిలో వాటిని సక్రమంగా అమలు చేసే బాధ్యతను కలెక్టర్లే తీసుకోవాలి.

• రీసర్వేను సమర్ధంగా నిర్వహించాలి. 

• 2 లక్షలకు పైగా జాయింట్ ఎల్ పీఎంల వివాదాలను పరిష్కరించండి

• 24 గంటలూ ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.

• అన్ని రంగాల్లో మెరుగైన పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.

• గత పాలకుడు రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లాడు... భావితరాల కోసం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
సోలార్ పంపు సెట్లతో అధిక లాభాలు
సోలార్ పంపు సెట్లతో అధిక లాభాలు పొందవచ్చునని మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ అన్నారు....
By Boiena Rajesh 2026-04-08 11:41:13 0 170
Telangana
మంచిర్యాల్: బిఆర్ఎస్ లో విద్యార్థి నేత చేరిక
మంచిర్యాల్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమీక్షంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు...
By Bonagiri RaviShankar 2026-05-30 11:44:16 0 175
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన శ్రీమతి బుట్టా రేణుక
ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీల చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలను...
By Boya Dasthagiri 2026-03-28 23:49:06 0 418
Andhra Pradesh
పుంగనూరు: పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సమావేశం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో మంగళవారం వైఎస్సార్ సీపీ రీజనల్...
By Kothuru Murali 2026-02-03 05:25:32 0 203
Andhra Pradesh
బోధనలో ప్రపంచస్థాయి ప్రమాణాలు.. ఏపీ టీచర్లకు 17 నుంచి ఫిన్లాండ్‌లో శిక్షణ.
  Andhra   ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ ఈ నెల 17 నుంచి 8...
By Pagadala Venkateswar 2026-08-15 09:58:13 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com