అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

0
422

విజయవాడ

15-12-2025

 

ప్రచురణార్ధం

 

అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్సి రుహుళ్ల, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

 

స్థానిక 43వ డివిజన్ ఊర్మిళా నగర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వైసిపి పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షుడు మద్దు బాలు ఆధ్వర్యంలో సోమవారం నాడు పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించా. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్రం కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములని అన్నారు. 51 రోజుల నిరాహారదీక్ష చేసి, తన ప్రాణాలను ఫణంగా పెట్టి మన రాష్ట్రాన్ని సాధించారన్నారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మాగాంధి చూపిన బాటలో పొట్టిశ్రీరాములు నడిచారన్నారు. అలాంటి వ్యక్తికి గౌరవం ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అగౌరవపరిచింది చంద్రబాబు అయితే.. మాజీ సీఎం జగన్ ఆ దినోత్సవాన్ని గౌరవించారన్నారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని నీరుగార్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

 

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎండి రుహుళ్ల, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పొగ మంచు తీవ్రతతో తప్పని తిప్పలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతతో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు...
By Kothuru Murali 2026-02-09 07:37:07 0 204
Telangana
తెలంగాణలో చికెన్ షాపుల బంద్ : ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మెకు పిలుపు.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని చికెన్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  పౌల్ట్రీ...
By Sidhu Maroju 2026-03-25 08:27:21 0 191
Telangana
నేలకొండపల్లిలో ప్రమాదం.. ఆరుగురు యువకులకు గాయాలు...
శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారును తప్పించబోయి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా...
By Krishna Balina 2026-03-06 09:58:52 0 466
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలో తెలుగు మెయిన్ స్కూల్ అడ్మిషన్
విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడమేమనగా , మన దగ్గర ఉండే కొద్ది పాటి డబ్బులు ఖర్చుపెట్టి...
By Boya Dasthagiri 2026-05-06 15:53:09 0 183
Telangana
జోనల్ కమిషనర్ తో సమావేశం- అల్వాల్ పురోగతి దిశగా మరో అడుగు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  అల్వాల్ డివిజన్ లో దోమల బెడద పెరిగి ప్రజారోగ్యంపై...
By Sidhu Maroju 2026-01-16 16:27:01 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com