ఎన్నికలు పకడ్బందీగా ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలి

0
90

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,

 

మహబూబాబాద్ జిల్లా, డిసెంబర్ 13: గ్రామపంచాయతీ ఎన్నికలు -25, సందర్భంగా జిల్లాలో రెండవ, మూడవ విడతలలో జరగబోయే ఎన్నికలను పకడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల కమిషనర్ సూచనల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. శనివారం అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో రెవెన్యూ, కె.అనిల్ కుమార్, సంబంధిత ఎన్నికల విభాగం అధికారులతో ఆయన రెండు, మూడవ విడత ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్ ఎన్ఐసి సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో ఐదు మండలాలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, రేపు జరగబోయే రెండవ విడత ఎన్నికలు అదేవిధంగా ఎన్నికల సంఘం సూచించిన ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికల సామాగ్రిని బ్యాలెట్ బాక్స్ లను పంపిణీ చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ వారికి సూచించిన ప్రకారం విధులు జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. 17వ తేదీన మూడవ విడత ఎన్నికల జరిగే మండలాలు (6) డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సిరోలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్లలో భోజన వసతి,త్రాగునీరు, చైర్స్, టెంట్స్, రవాణా సదుపాయం, వైద్య శిబిరాలు, తదితర తగిన ఏర్పాట్లు చేయాలని, ముందస్తు సమాచారం అందిస్తూ ఎన్నికల సిబ్బందికి తగిన సూచనలు జారీ చేయాలని సూచించారు, పోలింగ్ బ్యాలెట్ బాక్సులు సామాగ్రి, పోలింగ్ ముందు రోజు పోలింగ్ తర్వాత భద్రత మధ్య సంబంధిత రిసెప్షన్ సెంటర్లకు తరలించాలని.. పూర్తిగా పారదర్శకంగా ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలని తెలిపారు, ఎన్నికలు జరిగే ప్రదేశాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందించాలని సూచించారు. పూర్తి స్థాయిలో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసే ఎన్నికల విజయవంతనికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈవో పురుషోత్తం, డిపిఓ హరిప్రసాద్, ప్రత్యేక అధికారులు,ఆరు మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
📈 India’s Media & Entertainment Sector Hits ₹2.5 Trillion — Growth Brings New Hope and New Challenges
📈 India’s Media & Entertainment Sector Hits ₹2.5 Trillion - Growth Brings New Hope and...
By BMA ADMIN 2025-05-03 09:19:22 1 2K
BMA
Bharat Media Association
The Bharat Media Association isn't just an organization; it's the collective heartbeat of India's...
By Bharat Aawaz 2025-06-06 07:01:18 0 2K
Telangana
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే "కంటోన్మెంట్ వాణి" ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ :  ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మెరుగైన సేవలను అందించేందుకు కంటోన్మెంట్ వాణి...
By Sidhu Maroju 2025-09-10 11:40:45 0 143
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com