పదో తరగతి నుండి ఇంటర్ వరకు ఒకటే బోర్డు

0
64

తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పదో తరగతి (SSC) నుండి ఇంటర్మీడియట్ (Intermediate) వరకు ఒకే బోర్డు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది.

పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, విద్యార్థులకు నిరంతర, సమగ్ర విద్యావిధానాన్ని (Seamless Education System) అందించడం. ప్రస్తుతం ఉన్న బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (SSC బోర్డు) మరియు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIE) రెండింటినీ కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీబీఎస్‌ఈ (CBSE) విద్యావిధానం తరహాలో ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు మరింత సులువుగా సన్నద్ధం కావడానికి వీలు కలుగుతుంది.కొత్తగా ఏర్పాటు చేయబోయే బోర్డుకు సంబంధించిన పేరు, దాని విధివిధానాలపై త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

ఈ విద్యా సంస్కరణలు వచ్చే విద్యా సంవత్సరం (2026) నుండి అమలులోకి రావడానికి సంబంధించిన  విధివిధానాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది |

Like
1
Search
Categories
Read More
Telangana
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు!
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు తెలంగాణ ప్రభుత్వం, SC/ST & Minorities Welfare...
By BMA ADMIN 2025-09-20 10:25:53 0 307
Goa
गोवा क्रिकेट संघटनेनं BCCI सभेसाठी प्रतिनिधी न पाठवल्यानं अनिश्चितता
गोवा क्रिकेट संघटनेनं आगामी #BCCI वार्षिक सभेसाठी प्रतिनिधी नामांकित न केल्यामुळे #क्रिकेटच्या...
By Pooja Patil 2025-09-13 09:34:51 0 211
Telangana
రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్ : స్పందించిన డిజిపి
హైదరాబాద్:  రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-10-20 08:20:14 0 150
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com