టీజీఎస్ఆర్టీసీ 'హైదరాబాద్ కనెక్ట్': 373 కాలనీలకు బస్సు సేవలు

0
65

టీజీఎస్ఆర్టీసీ (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) ఇటీవల హైదరాబాద్ నగర పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి 'హైదరాబాద్ కనెక్ట్' పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ప్రధాన లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్త కాలనీలు, శివారు ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన బస్సు సేవలను అందుబాటులోకి తీసుకురావడం.

ఈ కార్యక్రమం కింద మొత్తంల 373 కొత్త కానీలకు బస్సు సర్వీసులు ప్రారంభించారు. ఈ కొత్త సేవల ద్వారా సుమారు 7.61 లక్షల మంది నివాసితులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది.

ఈ డిసెంబర్ నెల నుంచే ఈ బస్సులు రోడ్డెక్కుతాయని అధికారులు ప్రకటించారు.ఈ చర్య ద్వారా సొంత వాహనాల వినియోగాన్ని తగ్గించి, తద్వారా ట్రాఫిక్ రద్దీని, వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది |

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com