స్వర్గీయ ఇందిరా గాంధీ 108 వ జయంతి— నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
261

సికింద్రాబాద్ : జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం వద్ద వారి 108 వ జయంతి కార్యక్రమం స్ధానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్  దేశానికి వారు చేసిన సేవలను కొనియాడి, వారి స్పూర్తితోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని చెప్పారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ..

శ్రీమతి ఇందిరా గాంధీ చిన్నతనంలోనే  తండ్రి నెహ్రూ, మహాత్మా తో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని, వారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారని, భారతదేశం ఆహారాన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి భారత దేశ అవసరాలకు సరిపోను ఆహారాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తీసుకువచ్చారని, పాకిస్తాన్ పై యుద్ధం చేసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసిన ఘనత కూడా శ్రీమతి ఇందిరా గాంధీ గారికి దక్కుతుందని, ఆ యుద్ధ సమయంలో అమెరికా మాటలు కూడా ఖాతరు చేయలేదని, భారతదేశ సార్వభౌమత్యాన్ని కాపాడిన వ్యక్తి ఇందిరాగాంధీ అన్నారు,

దేశంలో 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయకరణ చేసి సంపన్న వర్గాలకే పరిమితమైన బ్యాంకులను పేద ప్రజలు కూడా బ్యాంకులకు వెళ్లే విధంగా చేసిన మహనీయురాలని, అందుకే ఆమెను ఉక్కు మహిళ అంటారని, భారతదేశానికి మొదటి, ఏకైక మహిళా ప్రధానిగా గుర్తింపు పొందారని వారి స్ఫూర్తితోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పం కూడా ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే వచ్చిందని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
"బస్తీ అభివృద్ధికి తలసాని బాట… ప్రజల మాటకే ప్రాధాన్యం.|
సికింద్రాబాద్: బస్తీ వాసుల అభీష్టం మేరకే అభివృద్ధి పనులు చేపడతామని మాజీమంత్రి, సనత్‌నగర్...
By Sidhu Maroju 2026-04-10 13:24:40 0 226
Technology
Samsung Begins Production of Its Slimmest Phone Yet — The Galaxy S25 Edge — in India
Samsung Begins Production of Its Slimmest Phone Yet — The Galaxy S25 Edge — in India...
By BMA ADMIN 2025-05-22 18:14:35 0 2K
Telangana
"ఆపరేషన్ సేఫ్ స్కూల్… హైదరాబాద్‌లో 558 దుకాణాలపై సజ్జనార్ భారీ దాడులు”
హైదరాబాద్ : నగరంలో స్కూల్ పరిసరాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు...
By Sidhu Maroju 2026-04-18 17:36:42 0 1K
Telangana
రామనగర్‌లో పర్యటించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.. సమస్యలపై ఆరా.,|
● మురుగునీటి కాలువల సమస్యకు పరిష్కారం చూపాలని సూచన ● దెబ్బతిన్న విద్యుత్ స్తంభం స్థానంలో కొత్తది...
By Sidhu Maroju 2026-08-12 11:01:22 0 136
Andhra Pradesh
హిందూ సమ్మేళన ఆహ్వానం
Rss హిందు యాంకర్ హైందవ సమాజాన్ని బలహీనపరిచేందుకు వారిని విభజించి ఐక్యత లేకుండా చేశారని...
By Rajini Kumari 2025-12-22 07:48:22 0 274
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com