ఆ స్నేహితులు మద్యానికి బానిసలు, ముఠాగా ఏర్పడి దారిదోపిడిలు- అరెస్ట్ చేసిన పోలీసులు.|

0
288

సికింద్రాబాద్ : మద్యానికి బానిసలుగా మారిన స్నేహితుల ముఠా దారిదోపిడిలకు పాల్పడుతూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఉత్తర మండల పరిధిలోని బేగంపేట,మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కత్తులతో బెదిరించి అమాయకుల నుండి దారిదోపిడిలకు పాల్పడుతున్న ఐదు మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు డిసిపి రష్మీ పెరుమాళ్ తెలిపారు. నిందితుల నుండి రెండు కత్తులు, రెండు సెల్ ఫోన్లతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు కేసులలో కార్ఖానా కు చెందిన ఆటో డ్రైవర్ రాజేష్ ప్రధాన సూత్రధారిగా జేబీఎస్ ,మడ్ ఫోర్డ్ ప్రాంతాలకు చెందిన నరసింహ, కార్తీక్, పరశురాం, శివ లు నేరానికి సహకరించినట్లు డిసిపి తెలిపారు. వీరంతా మధ్యానికి బానిసలుగా మారి పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనాలకు ఒడిగట్టినట్లు స్పష్టం చేశారు. కళ్యాణ్ అనే వ్యక్తి విధులు ఊహించుకొని ఇంటికి వెళ్తున్న తరుణంలో జేబీఎస్ వద్ద అతనిని అడ్డగించి కత్తులతో బెదిరించి 18 వేల రూపాయలను లాక్కొని పరారైనట్లు తెలిపారు. మరొక ఘటనలో పరేడ్ మైదానం వద్ద తన స్నేహితుని ఇంటికి వెళ్లేందుకు వేచి ఉన్న అన్సారి అనే వ్యక్తిపై ఆటోలో వచ్చిన దుండగులు కత్తి తో దాడికి పాల్పడి అతని వద్ద ఉన్న ఆరువేల రూపాయలను అపహరించుకొని ఆటోలో పరారయ్యారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా ఈ దారిదోపిడీలు ఒకే ముఠా చేసిన పనిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Sidhumaroju    

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం...
By Chennaiah Kati 2026-07-30 07:51:44 0 202
Telangana
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు
25-03-2026 చౌదర్పల్లి లో ఘనంగా సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలురంగారెడ్డి...
By MERIGE MALLESH 2026-03-25 16:08:58 0 364
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలుడికి జనసేన అండ.
మదనపల్లెలో రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న...
By Pagadala Venkateswar 2026-06-16 13:00:37 0 109
Andhra Pradesh
తేది:23.06.2026, మార్కాపురం గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి లో ఈనెల 27వ తేదీన జరగనున్న సీఎం పర్యటన ఏర్పాట్లపై
 గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి లో ఈనెల 27వ తేదీన జరగనున్న సీఎం పర్యటన ఏర్పాట్లపై...
By Chennaiah Kati 2026-06-24 15:34:54 0 169
Andhra Pradesh
దుర్గ గుడికి లక్ష విరాళం
*దుర్గగుడి అభివృద్ధికి లక్ష విరాళం*     విశాఖపట్నంలోని మాధురవాడకు చెందిన వంగపండు...
By Rajini Kumari 2025-12-31 10:19:50 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com