తుఫాన్‌పై ప్రధాని-చంద్రబాబు కీలక చర్చ |

0
26

తుఫాన్ "మొంథా" ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో తుఫాన్ తీవ్రత, సహాయ చర్యలు, కేంద్ర సహకారం తదితర అంశాలపై ఇద్దరూ చర్చించారు.

 

 ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. కేంద్రం నుంచి SDRF, NDRF బృందాల మోహరింపు, నిధుల మంజూరు వంటి అంశాలపై ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం.

 

 విశాఖపట్నం జిల్లాలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, కేంద్రం ప్రత్యేక దృష్టి సారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 27 వేల సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేసింది. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
352 వంతెనల పునరుద్ధరణకు ₹1,430 కోట్లు |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 352 నష్ట పడిన వంతెనలను పునరుద్ధరించడానికి ₹1,430 కోట్ల అవసరం...
By Bhuvaneswari Shanaga 2025-09-24 10:30:18 0 87
Andhra Pradesh
సౌభాగ్యం కోసం ఉపవాసం: అట్లతద్ది ఆడబిడ్డల సంబరం |
అచ్చమైన తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగలలో అట్ల తద్ది ముఖ్యమైంది.     ...
By Meghana Kallam 2025-10-10 01:18:36 0 32
Telangana
ప్రైవేట్ ట్రావెల్స్‌పై RTA కొరడా ఝుళిపించింది |
కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం హైదరాబాద్‌లో రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) భారీ...
By Akhil Midde 2025-10-27 09:58:39 0 23
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com