నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నిందితుడు రియాజ్ పోలీసులకు దొరికిండు.

0
129

హైదరాబాద్:  నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన రియాజ్ పోలీసులకు చిక్కాడు. నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ సమీపంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

అక్కడ ఎప్పుడో రోడ్డు ప్రమాదానికి గురై సగం మిగిలిపోయి.. నిరుపయోగంలో ఉన్న ఒక లారీలో నిందితుడు రియాజ్ దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ అరెస్ట్ కావడం గమనార్హం. శనివారం రాత్రి నుంచి 9 బృందాలతో పోలీసులు రియాజ్ కోసం గాలించారు. ఎట్టకేలకు రియాజ్ను అదుపులో తీసుకున్న పోలీసులు అతనిపై కాల్పులు జరిపినట్లు సమాచారం.

నిజామాబాద్‌ నగరంలో సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను హత్య చేయడంతో పాటు అతడి మేనల్లుడు ఆకాశ్‌, ఎస్సై విఠల్‌ను రియాజ్‌ గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ సాయిచైతన్య నిందితుడు రియాజ్‌ అరబ్‌ను పట్టుకునేందుకు ఎనిమిది స్పెషల్‌ టీమ్‌లను రంగంలోకి దింపారు. రియాజ్‌ నగరం నుంచి బయటకు వెళ్లకుండా ఎక్కడికక్కడే నాకాబందీ నిర్వహిస్తూ, పట్టణాన్ని జల్లెడ పట్టారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ ప్రమోద్‌ డెడ్‌బాడీకి పోస్టుమార్టం అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

కానిస్టేబుల్గా పని చేసే ప్రమోద్‌ తన అన్న నర్సింగ్ కూతురు అపెండిసైటిస్ఆపరేషన్ చేయించుకొని నగరంలోని ఓ ప్రైవేట్హాస్పిటల్లో ఉండగా, ఆమెను పరామర్శించడానికి శుక్రవారం సాయంత్రం మేనల్లుడు ఆకాశ్తో కలిసి బైక్మీద బయలుదేరాడు. అదే టైంలో రౌడీ రియాజ్అరబ్ సమాచారం రావడంతో, మేనల్లుడితో కలిసి ఖిల్లా ఏరియాకు చేరుకున్నాడు. విషయాన్ని సీసీఎస్ ఎస్సైలు విఠల్, భీంరావ్కు తెలియజేసి, నిందితుడి కోసం వెతుకుతుండగా మురికి కెనాల్ దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా, అదే కాలువలో దూకి ప్రమోద్ అతడిని పట్టుకున్నాడు. నిందితుడి స్కూటీపైనే మధ్యలో కూర్చోబెట్టుకొని సీసీఎస్ స్టేషన్కు తీసుకెళ్తూ హత్యకు గురయ్యాడు. ప్రమోద్ఛాతీలో కత్తితో పొడవగా, మేనల్లుడు ఆకాశ్ఆపేందుకు ప్రయత్నించగా అతడిపై కూడా దాడి చేశాడు. వారి వెనకాలే బైక్పై వచ్చిన ఎస్సై విఠల్ను అదే కత్తితో గాయపర్చి పరారయ్యాడు. మరో ఎస్సై భీంరావ్అక్కడికి చేరుకొని ఈ విషయాన్ని ఆఫీసర్లకు చేరవేశాడు.

రియాజ్‌పై 37 కేసులు.

కానిస్టేబుల్ను హత్య చేసిన రియాజ్ అరబ్పై నిజామాబాద్ జిల్లాలో 37 కేసులు ఉన్నాయి. వెహికల్స్ చోరీ, దొంగతనం, చైన్ స్నాచింగ్, మర్డర్ కేసులు ఉండగా, బెయిల్పై రిలీజై నేరాలు చేస్తున్నాడు. నగరంలో వరుస బైక్ చోరీలకేసు దర్యాప్తును సీసీఎస్కు అప్పగించగా, రియాజ్ ను పట్టుకున్న ప్రమోద్ అనూహ్యంగా హత్యకు గురయ్యాడు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
భాగ్యనగరంలో ఆఫ్రికన్ నత్తలు – భయాందోళనలో ప్రజలు.|
సికింద్రాబాద్ : భాగ్యనగరంలో నత్తలు  బెంబేలెత్తిస్తునాయి. ఆఫ్రికన్ నత్తల దాడికి ఎంతటి మహా...
By Sidhu Maroju 2025-11-06 08:06:55 0 87
Telangana
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్
 దొడ్డి అల్వాల్ సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్తులకు కార్పొరేటర్  సబిత అనిల్...
By Sidhu Maroju 2025-06-26 10:06:01 0 1K
Telangana
Prashanth takes charge as new SHO of Alwal Police Station
'Bharat Aawaz News Channel' congratulates Prashant garu on assuming charge as the new SHO of Alwal.
By Sidhu Maroju 2025-07-05 15:30:24 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com