ట్రేడ్‌ వార్‌ సముద్రంలోకి.. నౌకలపై ఫీజులు |

0
30

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి ముదిరింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్‌పై 100 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ప్రకటించడంతో, చైనా కూడా ప్రతిస్పందనగా అమెరికా నౌకలపై ప్రత్యేక ఫీజులు విధించనుంది.

 

సముద్ర మార్గాల్లో నౌకలపై ఈ ఫీజులు వాణిజ్య వ్యయాలను పెంచే అవకాశం ఉంది. ఆటోమొబైల్, క్రూడ్ ఆయిల్, టాయ్స్ వంటి వస్తువుల రవాణాపై ప్రభావం పడనుంది. చైనా నిర్మించిన నౌకలకు మినహాయింపు ఇచ్చినట్లు అక్కడి అధికారిక ప్రసార సంస్థ తెలిపింది.

 

అంతర్జాతీయ మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. వాణిజ్య ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com