వాణిజ్య పురోగతిపై మోదీ-ట్రంప్ ఫోన్ సంభాషణ |

0
27

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. చారిత్రక గాజా శాంతి ఒప్పందం విజయవంతమైనందుకు మోదీ ట్రంప్‌కు అభినందనలు తెలిపారు.

 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి స్థాపనకు అమెరికా చేసిన కృషిని మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా, భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల పురోగతిపై కూడా నేతలు సమీక్షించారు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న చర్చలు గాడిలో పడుతున్నాయని నేతలు అభిప్రాయపడ్డారు. 

 

మోదీ తన 'ఎక్స్' ఖాతాలో "నా మిత్రుడు ట్రంప్‌తో చర్చించాను" అంటూ వివరించారు. ఈ సంభాషణ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచనుంది.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com