వినాయక చవితిని మూడు రోజులు జరుపుకోవాలని:- ఎస్.ఐ చిరంజీవి

0
409

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగను మూడు రోజులపాటు జరుపుకోవాలని మంగళవారం ఎస్సై చిరంజీవి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు పట్టణంలో గతంలో వినాయక చవితి పండుగను నిర్వాహకులు మూడు రోజులపాటు జరుపుకునే వారన్నారు. ఈ ఏడాది వినాయక పండుగ సంబరాలను ఐదు రోజులపాటు జరుపుకుంటామని నిర్వాకులు తన దృష్టికి తీసుకొని వచ్చారన్నారు. అయితే ఆదోనిలో వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని ఐదు రోజులకు జరుపుతున్నందున పోలీసులు బందోబస్తును గూడూరులో జరిగే వినాయక నిమజ్జనానికి భద్రత సిబ్బందిని ఏర్పాటు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుందని కావున వినాయక కమిటీ నిర్వాహకులు , పోలీసు సిబ్బందికి సహకరించి మూడు రోజులపాటు వినాయక ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. దీంతో పాటు ఫైర్, విద్యుత్ శాఖల అధికారుల వద్ద నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు /మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన పోలీసు సిబ్బందిని జిల్లా అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కావున వినాయక మండపాల కమిటీ నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించి మూడు రోజులపాటు ఉత్సవాలను జరుపుకునే విధంగా దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

Like
1
Search
Categories
Read More
BMA
🖋️ YOUR STORY – EVERY INDIAN JOURNALIST
You are more than a Reporter! You are the voice of the voiceless! The eyes that see the...
By BMA (Bharat Media Association) 2025-04-18 09:11:11 0 2K
Andhra Pradesh
68వ పార్లమెంటరీ సదస్సులో ఏపీకి ప్రతినిధిగా పత్రుడు |
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ శ్రీ సి. అయ్యన్న పత్రుడు అక్టోబర్ 7 నుంచి 10 వరకు...
By Bhuvaneswari Shanaga 2025-10-07 12:55:24 0 58
Andhra Pradesh
పెద్దలు పూజ్యులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి
గూడూరు నగర పంచాయతీ నందు పెద్దలు పూజ్యులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా స్థానిక...
By mahaboob basha 2025-09-25 10:24:36 0 129
Andhra Pradesh
వీరప్పల్లె వద్ద అక్రమ తవ్వకంపై పోలీసుల దాడి |
చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం వీరప్పల్లె గ్రామ సమీపంలో అక్రమంగా నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న...
By Deepika Doku 2025-10-13 06:08:45 0 63
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com