ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్

0
513

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: బొల్లారం.

ఆగస్టు 15, భారతదేశపు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోబడుతోంది. ఈ సందర్భంగా జరిగిన వేడుకలో ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.  స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం..ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న  మీ అందరికీ నా తరపున శుభాకాంక్షలు. మనం ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం ఊరికే వచ్చింది కాదు. వందల సంవత్సరాల కాలం పాటు ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రాంతాలు భాషలు, సంస్కృతులు వేరైనా, ఒకటే జెండా, ఒకటే నినాదం, "భారత్ మాతాకీ జై", అని నినదిస్తూ భారతదేశానికి స్వాతంత్రం రావాలనే సంకల్పం. భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వారు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటంచేసి, ఉరికంబాలెక్కి ఈ దేశ విముక్తి కోసం, మన స్వేచ్ఛ కోసం వాళ్ళ అమూల్యమైన ప్రాణాలను బలి ఇచ్చారు. మహాత్మా గాంధీ వారి నాయకత్వంలో ఎక్కడ హింసకు ఆస్కారం లేకుండా స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఒకవైపు అహింస, మరోవైపు ఒక చెంప కొడితే ఇంకో చెంపని ఇవ్వకూడదు,  మన పటిమ, మన వేడి ఏంటో తెలియాలని, భగత్ సింగ్ లాంటి వాళ్ళ పోరాటం మరోవైపు. ఇలా కాదని చెప్పి బయటి దేశాలకెళ్ళి సైన్యాన్ని నిర్మాణం చేసి, భారతదేశ విముక్తి కోసం  సుభాష్ చంద్రబోస్ లాంటి వాల్ల త్యాగాల ఫలితం వల్లనే మనకు స్వాతంత్రం సిద్ధించింది.  ఇవాళ మన ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, ఎందరో లక్షలాది మంది భారతమాత ముద్దుబిడ్డలు, ఆనాడు పోరాటం చేసి, వాళ్ళ అమూల్యమైన ప్రాణాలను ఫణంగా పెట్టి మనకందించిందే ఈ స్వాతంత్రం.  ఇవాళ 79వ స్వాతంత్ర వేడుకల్ని దేశవ్యాప్తంగా,  కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు అన్ని ప్రాంతాల ప్రజలకు ఇవాళ మూడు రంగుల జెండా చేతబూని మా దేశమంతా ఒకటే...భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు వేరు కావచ్చు, కానీ మేమందరం భారతమాత ముద్దుబిడ్డలమనే సంకల్పం ఇవాళ కనబడుతుంది. ఈ తరం పిల్లలకు ఆనాటి మహానుభావుల త్యాగాలు తెలియదు. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, చదువులు అనే పద్ధతే కాకుండా మన పూర్వీకుల యొక్క త్యాగాలు,  వాళ్ళ పోరాట ఫలితాలను మనం ముందు భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది.  ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేది మూడు రంగుల మువ్వన్నెల జెండా. ఐక్యంగా ఉంచగలిగేది మన త్యాగం. మన దేశంలో తప్ప ప్రపంచంలో ఇంత గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థ ఎక్కడ లేదు. రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ సేవలను మనం మర్చిపోకూడదు. పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా భారత మాత ముద్దుబిడ్డలుగా ఈరోజు మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ స్ఫూర్తిని, ఐక్యతను రాబోయే కాలంలో మరింత సమున్నతంగా నిలపడంలో అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను.. అన్నారు.   ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి అర్బన్ జిల్లా బిజెపి సెక్రటరీ చింతల మాణిక్య రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ అజయ్ రెడ్డి, బిజెపి నాయకులు ఉదయ్ ప్రకాష్, ఎం.శ్రీనివాస్, డి.వెంకటేష్, మహిపాల్ రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, కరుణశ్రీ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

    Sidhumaroju.

Search
Categories
Read More
Music
Javed Akhtar Hails New Indian Music App as a 'Major Milestone' for Artistic Freedom
Javed Akhtar Hails New Indian Music App as a 'Major Milestone' for Artistic Freedom Veteran...
By BMA ADMIN 2025-05-22 17:25:33 0 2K
Telangana
పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ :
సికింద్రాబాద్/సికింద్రాబాద్. సికింద్రాబాద్..   కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం...
By Sidhu Maroju 2025-07-26 08:15:12 0 721
Entertainment
ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లపై సినిమాల పంట |
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గినా, OTT ప్రపంచంలో మాత్రం వినోదం పుష్కలంగా ఉంది....
By Akhil Midde 2025-10-24 09:18:27 0 35
BMA
Importance and Need of Media Associations
In India's vibrant democracy, media associations are not just beneficial, but essential –...
By Bharat Aawaz 2025-05-28 18:29:58 0 2K
International
వాణిజ్య పురోగతిపై మోదీ-ట్రంప్ ఫోన్ సంభాషణ |
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. చారిత్రక...
By Bhuvaneswari Shanaga 2025-10-10 04:54:08 0 28
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com