Bharat Aawaz

బోధన్‌లో చేయూత పింఛన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
16
Views

బోధన్‌లో నేడు అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు ఉత్తర్వులను అధికారికంగా పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.5 లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, మున్సిపల్, మండల స్థాయి అధికారులు, ప్రజా నాయకులు నూతనంగా పింఛన్లకు ఎంపికైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు మంజూరు పత్రాలను అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ఎలాంటి ఆలస్యం లేకుండా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న పింఛన్ దరఖాస్తులను పరిష్కరించి తమకు నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

చేయూత పథకం కింద నూతనంగా ఎంపికైన సాధారణ కేటగిరీ లబ్ధిదారులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు నెలకు రూ.4,016 చొప్పున పింఛన్ అందించనున్నారు. తొలి నెల పింఛన్ నగదును నవంబర్ 19, 2026న లబ్ధిదారుల ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.